పాలమూరు స్ట్రైకర్స్‌పై ఖమ్మం ఘన విజయం | TG20 League: Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates | Sakshi
Sakshi News home page

TG20 League: పాలమూరు స్ట్రైకర్స్‌పై ఖమ్మం ఘన విజయం

Jun 21 2026 7:19 PM | Updated on Jun 21 2026 11:40 PM

TG20 League: Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates

Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates:. తెలంగాణ టీ20 లీగ్‌ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్‌ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

 పాలమూరు బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 86) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. చైతన్య రెడ్డి(35) ప‌ర్వాలేద‌నిపించాడు. మిగితా బ్యాట‌ర్లంతా చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్‌రెడ్డి రెండు, మిలింద్‌, వెంకట్‌, విద్యానంద రెడ్డి తలా వికెట్‌ సాధించారు.

పాలమూరు ఐదో వికెట్‌ డౌన్‌
పాలమూరు ఐదో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ప్రతీక్‌ పవార్‌.. మిలింద్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 17 ఓవర్లకు పాలమూరు స్కోర్‌: 190/5. పాలమూరు విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి.

పాలమూరు మూడో వికెట్‌ డౌన్‌
35 పరుగులు చేసిన చైతన్య రెడ్డి.. రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు పాలమూర్‌ స్కోర్‌: 167/3

పాలమూరు రెండో వికెట్‌ డౌన్‌
పాలమూరు రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రజ్ఞయ్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు.

పాలమూరు తొలి వికెట్‌ డౌన్‌
పాలమూరు తొలి వికెట్‌ కోల్పోయింది. 86 పరుగులు చేసిన విగ్నేష్ రెడ్డి.. వేద్‌రెడ్డి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పాలమూరు స్కోర్‌: 133/1

దూకుడుగా ఆడుతున్న పాలమూరు ఓపెనర్లు
238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్‌  ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి పాలమూరు వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో అనుముల విగ్నేష్ రెడ్డి(45), చైతన్య రెడ్డి(7) ఉన్నారు.

పాలమూరు టార్గెట్‌ ఎంతంటే?
పాలమూరు స్ట్రైకర్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

ఏసెస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్‌ మిలంద్‌(18, ప్రతీక్‌ రెడ్డి(25) రాణించారు. పాలమూర్‌ బౌలర్లలో కిరణ్‌ రెండు, రోహిత్‌ రాయుడు, అఫ్రిది అహ్మద్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

మూడో వికెట్‌ డౌన్‌
ఖమ్మం జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జైశ్వాల్‌.. అఫ్రిది అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు స్కోర్‌: 150/3

ఖమ్మం రెండో వికెట్‌ డౌన్‌
ఖమ్మం ఏసెస్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కృష్ణ రెడ్డి.. రోహిత్‌ రాయుడు బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఏసెస్‌ స్కోర్‌: 141/2

ఖమ్మం ఏసెస్ తొలి వికెట్‌ డౌన్‌
అన్విత ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన వాఫీ కచ్చీ.. నిపుణ్ రెడ్డి శవ్వా బౌలింగ్ ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఏసెస్‌ స్కోర్‌: 113/1

దుమ్ములేపుతున్న ఖమ్మం ఓపెనర్లు
అన్విత ఖమ్మం ఏసెస్ ఓపెనర్లు కృష్ణ రెడ్డి(18 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లతో 30),  వాఫీ కచ్చీ(24 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) దుమ్ములేపుతున్నారు. 7 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ స్కోర్‌: 86/0

తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్‌కు తెరలేచింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఉప్పల్‌ మైదానం వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌, అన్విత ఖమ్మం ఏసెస్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

తుది జట్లు
ఖ‌మ్మం ఏసెస్
కృష్ణ రెడ్డి,  వాఫీ కచ్చీ, మిలింద్‌(కెప్టెన్‌), జైశ్వాల్‌, హిమ‌తేజ‌, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డి

పాల‌మూరు స్ట్రైక‌ర్స్‌
అన్ముల విఘ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి(కెప్టెన్‌), పృథ్వీ రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్‌ పవార్‌, మహమ్మద్ అఫ్రీది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, బుడిది రతన్ తేజ, పి.ఎస్. చైతన్య రెడ్డి, జంబోజు పార్థిపన్, రవి కిరణ్ మజేటి
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement