నల్గొండతో మ్యాచ్‌.. మెదక్‌ నామమాత్రపు స్కోరు | TG20 League 2026 Medak Falcons Scores 180 Vs Nalgonda Knights | Sakshi
Sakshi News home page

నల్గొండతో మ్యాచ్‌.. మెదక్‌ నామమాత్రపు స్కోరు

Jul 3 2026 4:09 PM | Updated on Jul 3 2026 4:12 PM

TG20 League 2026 Medak Falcons Scores 180 Vs Nalgonda Knights

రాహుల్‌ బుద్ధి- రవి తేజ (PC: TG20 X)

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌-2026లో శుక్రవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో మెదక్‌ ఫాల్కన్స్‌- నల్గొండ నైట్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌ వేదికగా టాస్‌ గెలిచిన మెదక్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

ఓపెనర్లలో నమన్‌ అగర్వాల్‌ (18) ఫర్వాలేదనిపించగా.. శృంజిత్‌ రెడ్డి (17 బంతుల్లో 30) మెరుపులు మెరిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రవితేజ 33 పరుగులు చేశాడు. 

ఆఖర్లో విక్రం నాయక్‌ (31 బంతుల్లో 48), వరుణ్‌ యర్రం (29 బంతుల్లో 44) మెరుగ్గా రాణించి అజేయంగా నిలిచారు. నల్గొండ బౌలర్లలో రక్షన్‌ రెడ్డి, అనికేత్‌ రెడ్డి, సతాని తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

తుదిజట్లు
మెదక్‌ ఫాల్కన్స్‌
రవితేజ (కెప్టెన్‌), నమన్‌ అగర్వాల్‌, శృంజిత్‌ రెడ్డి, విక్రమ్‌ నాయక్‌ (వికెట్‌ కీపర్‌), సాయి వరుణ్‌ యర్రం, అర్జున్‌ గొర్రపల్లి, జగమ్‌ బన్నీ, నొమన్‌ అహ్మద్‌, సయ్మద్‌ ఘాజి అబ్బాస్‌, కార్తికేయ కాక్‌, మధుకర్‌ మన్నె

నల్గొండ నైట్స్‌
రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), అనికేత్‌ రెడ్డి, టి.హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), గౌరవ్‌ రెడ్డి, జశ్వంత్‌ మోటే, నితీశ్‌ రెడ్డి, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, దివేశ్‌ సింగ్‌, ఇల్యాన్‌ సతాని, ఉర్వేశ్‌ కక్కడ్‌, రక్షన్‌ రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement