breaking news
Aman Rao Perala
-
వరంగల్‌ను చిత్తు చేసిన హైదరాబాద్
తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఇ- చాంపియన్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వరంగల్ స్కోరెంతంటే?వరంగల్ ఓపెనర్లలో హర్షిత్ చౌదరి (22) త్వరగానే వెనుదిరగగా.. కెప్టెన్ అమన్ రావు (20 బంతుల్లో 45) రాణించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రిషికేత్ 38 పరుగులు చేయగా.. మిగిలిన వారిలో శౌనక్ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.మురుగన్ అభిషేక్ (4) పూర్తిగా విఫలం కాగా.. ధీరజ్ 18, భవేశ్ 6, ఆది మణి కిరణ్ 5, ముదస్సర్ 3 పరుగులు చేసి నిష్క్రమించారు. క్రాంతి (2), సల్మాన్ అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో వరంగల్ తొమ్మిది వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది.హైదరాబాద్ బౌలర్లలో అజయ్ గౌడ్ మూడు వికెట్లతో చెలరేగగా.. దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖ అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ కేవలం 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ అభిరథ్ రెడ్డి అజేయ శతకం (43 బంతుల్లో 101)తో అదరగొట్టగా.. గడుగు గణేశ్ అర్ధ శతకం (31 బంతుల్లో 50)తో అలరించాడు. వరంగల్ బౌలర్లలో సల్మాన్ ఖాన్, క్రాంతి, శౌనక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లువరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేత్ (వికెట్ కీపర్), రిషికేత్ సిసోడియా, హర్షిత్ చౌదరి, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుసేన్, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్, సల్మాన్ ఖాన్.హైదరాబాద్అభిరథ్ రెడ్డి మందాడి (కెప్టెన్), సాయి వికాస్ రెడ్డి, గడుగు గణేశ్, వైష్ణవ్ రెడ్డి, ప్రణవ్ వర్మ, అరవింద్ (వికెట్ కీపర్), అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, ఎంఏ షణ్ముఖ. -
నరాలు తెగే ఉత్కంఠ.. బోణీ కొట్టిన కరీంనగర్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. వరంగల్ వారియర్స్‌తో ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో.. రెండు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. కరీంనగర్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది.తన్మయ్ అగర్వాల్ అద్భుత శతకంకరీంనగర్ బ్యాటర్లలో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ అద్భుత రీతిలో రాణించాడు. 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. కిరణ్ బౌలింగ్‌లో LBW కావడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. Simply outstanding! 🤩A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించాడు. వరంగల్ బౌలర్లలో ముదస్సర్ రెండు వికెట్లు తీయగా.. ఆది మణి కిరణ్, శౌనక్ కులకర్ణి, మురుగన్ అభిషేక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది.గెలుపు ఆశలపై నీళ్లుఓపెనర్లు హర్షిత్ చౌదరి (31), కెప్టెన్ అమన్ రావు (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ రిషికేత్ సిసోడియా అర్ధ శతకం (31 బంతుల్లో 65)తో రాణించాడు. మిగిలిన వారిలో భవేశ్ సేత్ కూడా హాఫ్ సెంచరీ (27 బంతుల్లో 53 నాటౌట్) బాదాడు. శౌనక్ (6 బంతుల్లో 14) దూకుడుగా ఆడగా.. ఆఖరి ఓవర్లలో మూడు సిక్సర్లు బాది భవేశ్ గెలుపు ఆశలు రేపాడు. కానీ విజయ లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. దీంతో రెండు పరుగుల తేడాతో వరంగల్ ఓటమిపాలైంది.కరీంనగర్ బౌలర్లలో సతీశ్ కుమార్ రెండు... శుభం శర్మ, రత్లావత్ దినేశ్, హరీశ్ ఠాకూర్, ఆశిష్ శ్రీవాస్తవ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఇప్పటికి కరీంనగర్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఇదే తొలి గెలుపు.తుదిజట్లుకరీంనగర్ డైమండ్స్సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్వరంగల్ వారియర్స్హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి. -
వరంగల్‌తో మ్యాచ్.. నల్గొండ బ్యాటింగ్
తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో భాగంగా శుక్రవారం వరంగల్ వారియర్స్- నల్గొండ నైట్స్ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో వేదికగా టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నల్గొండ నైట్స్ బ్యాటింగ్‌కు దిగింది.కాగా ఇప్పటికి రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న వరంగల్.. ఒక విజయం.. ఒక పరాజయం నమోదు చేసింది. ఫలితంగా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. నల్గొండ సైతం ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతోంది.తుదిజట్లునల్గొండప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, నితీశ్ రెడ్డి, రాహుల్ బుద్ధి (కెప్టెన్), దివేశ్ సింగ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి.హర్షవర్దన్ సింగ్, అనికేత్ రెడ్డి, వరుణ్ గౌడ్, రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను.వరంగల్అమన్ రావు (కెప్టెన్), హర్షిత్ చౌదరి, రిషికేత్ సిసోడియా, భవేశ్ సేత్, మురుగన్ అభిషేక్, ఆది మణి కిరణ్, ఆసిఫ్ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్ అబ్దుల్ మాలిక్, ముదస్పర్ హుసేన్, శౌనక్ కులకర్ణి. -
‘దూకుడే నా శైలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టి20 లీగ్‌లో భాగంగా వరంగల్ వారియర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్ పేరాల అమన్ రావు మెరుపు శతకంతో చెలరేగిపోయాడు. మెదక్ ఫాల్కన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను చివరకు 48 బంతుల్లో 142 పరుగులు సాధించాడు. రాష్ట్ర స్థాయి లీగ్ పోటీల్లో అమన్దే వేగవంతమైన శతకం. అయితే దీంతో తాను సంతృప్తి చెందలేదని, మరో మూడు బంతుల ముందే సాధించాల్సిందని అతను అన్నాడు. ‘శతకానికి చేరువవుతున్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సింది. నేను అనుకున్నదాని ప్రకారం 29 బంతుల్లోనే సెంచరీ రావాలి. కానీ కాస్త ఆలస్యం కావడంతో నేను నిరుత్సాహ పడ్డాను. అయితే మున్ముందు మరో అవకాశం వస్తే వదిలి పెట్టను’ అని గురువారం ‘సాక్షి’తో అమన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్ తిలక్ వర్మ కూడా సెంచరీ చేయడంతో చివరకు వరంగల్ ఓటమి పాలైనా, అమన్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. దూకుడుగా బ్యాటింగ్ చేయడమే తన శైలి అని, తొలి బంతి నుంచి చెలరేగడం అలవాటుగా మార్చుకున్నానని అమన్ చెప్పాడు. ‘కెరీర్ ఆరంభం నుంచి నేను ఇదే తరహాలో ఆడతాను. హైదరాబాద్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వేగంగా పరుగులు సాధించాను. ఇప్పుడు తెలంగాణ టి20 లీగ్‌లో దీనిని కొనసాగిస్తున్నా. మేం మెదక్‌తో మ్యాచ్ ఓడినా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం చూశాను. వారికి కావాల్సింది అదే. పైగా ఈ మ్యాచ్‌తో లీగ్‌లో సరైన ఊపు లభించిందని భావిస్తున్నా’ అని అమన్ రావు చెప్పాడు. ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ బెంగాల్‌పై అద్భుత డబుల్ సెంచరీ చేయడం అమన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. 186 వద్ద నుంచి ఇన్నింగ్స్‌లో మిగిలిన చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 2, 6 బాది అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. ‘వన్డే డబుల్ సెంచరీ నాకు ఎంతో ప్రత్యేకం. కెరీర్ ఆరంభ దశలోనే ఇలాంటి ఇన్నింగ్స్ రావడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే సీజన్లలో మరింత మంచి ప్రదర్శనలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్నా’ అని అతను వెల్లడించాడు. 2026 ఐపీఎల్ సీజన్లో అమన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీనిపై నిరాశ చెందలేదని, తనదైన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అతను వ్యాఖ్యానించాడు. ‘నా ప్రతిభను రాయల్స్ గుర్తించింది. అందుకే టీమ్‌లోకి తీసుకున్నామని హెడ్ కోచ్ సంగక్కర చెప్పారు. అయితే టీమ్ కాంబినేషన్ కారణంగా ఆడే చాన్స్ లభించలేదు. నిరాశపడవద్దని, మున్ముందు ఇదే జట్టుతో కొనసాగించి అవకాశాలు కల్పిస్తామని ఆయన నాకు ధైర్యం చెప్పారు. ఇది ఆరంభమే కదా. మున్ముందు ఐపీఎల్లో సత్తా చాటగలనని నమ్ముతున్నా’ అని అమన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ప్రతిభాన్వేషణ బృందాలను ఆకట్టుకునేందుకు టీజీ టి20 మంచి చాన్స్ అని, కొత్త ఆటగాళ్లు దీనిని అందిపుచ్చుకోవాలన్న అమన్... వారియర్స్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ‘ఐపీఎల్లో తరహాలోనే టీజీ లీగ్ సాగుతోంది. సరైన సమయంలో మన రాష్ట్ర ఆటగాళ్లకు ఈ వేదిక లభించడం శుభపరిణామం. మా జట్టు రెండో మ్యాచ్‌లో అలవోక విజయం సాధించింది. పలువురు ప్రతిభావంతులతో టీమ్ పటిష్టంగా ఉంది. టీమ్ యాజమాన్యం కూడా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. తొలి సీజన్లో వరంగల్ వారియర్స్‌ను విజేతగా నిలపాలన్నదే నా లక్ష్యం’ అని అమన్ రావు చెప్పాడు. -
ఖమ్మంను చిత్తు చేసిన వరంగల్
తెలంగాణ టీ20 లీగ్- 2026 (టీజీ20)లో భాగంగా బుధవారం వరంగల్ వారియర్స్- ఖమ్మం ఏసెస్ తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా ఖమ్మం బ్యాటింగ్‌కు దిగింది.ఖమ్మం ఆలౌట్ఓపెనర్లలో వాఫీ కచ్చీ (17) విఫలం కాగా.. మయాంక్ గుప్త అర్ధ శతకం (54)తో రాణించాడు. మిగిలిన వారిలో హిమతేజ (23), ప్రతీక్ రెడ్డి (20) ఫర్వాలేదనిపించగా.. మికిల్ జైస్వాల్ మెరుపు హాఫ్ సెంచరీ (22 బంతుల్లో 54)తో దుమ్ములేపాడు.కెప్టెన్ సీవీ మిలింద్ 11 పరుగులకే వెనుదిరగగా.. వరంగల్ బౌలర్ల ధాటికి విశాల్ యాదవ్ (0), విద్యానంద రెడ్డి (6), సాయి వెంకట్ ధాత్రక్ (2), మహేశ్ విప్పర్ల (1) పెవిలియన్‌కు వరుసకట్టారు. వేద్ రెడ్డి అమిస్తాపురం 5 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వరంగల్ బౌలర్లలో మహ్మద్ అబ్దుల్ మాలిక్, అభిషేక్ మూడేసి వికెట్లు కూల్చగా.. క్రాంతి పల్లెపాటి రెండు, మదస్సర్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.వరంగల్ ఘన విజయంలక్ష్య ఛేదనకు దిగిన వరంగల్ ఏడు బంతులు మిగిలి ఉండగానే.. కేవలం ఐదు వికెట్లు కోల్పోయి (208-5) పని పూర్తి చేసింది. హర్షిత్ చౌదరి మెరుపు సెంచరీ (62 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు: 121 రన్స్) చేసి ఒంటిచేత్తో వరంగల్‌ను గెలిపించాడు. మిగిలిన వారిలో రిషికేత్ సిసోడియా 27 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఖమ్మం బౌలర్లో సాకేత్ ధాత్రక్ రెండు వికెట్లు తీయగా.. సీవీ మిలింద్, మహేశ్ విప్పర్ల, వేద్ రెడ్డి తలా ఒక వికెట్ పడగొట్టారు.తుదిజట్లుఖమ్మం వాఫీ కచ్చీ, మయాంక్ గుప్త, సీవీ మిలింద్ (కెప్టెన్), హిమతేజ, మికిల్ జైస్వాల్, ప్రతీక్ రెడ్డి, సాయి వెంకట్ ధాత్రక్, విశాల్ యాదవ్, మహేశ్ విప్రాలా, వేద్‌రెడ్డి అమిస్తాపురం, విద్యానంద రెడ్డివరంగల్అమన్ రావు పేరాల (కెప్టెన్), భవేశ్ సేథ్ (వికెట్ కీపర్), రుషికేశ్ సిసోడియా, హర్షిత్ చౌదరి, అభిషేక్, మణి కిరణ్, షౌనక్ కులకర్ణి, హుసేన్, క్రాంతి పల్లెపాటి, శ్రీవాస్తవ టీపీ, అబ్దుల్ మాలిక్. -
TG20 League: వైభవ్ టీమ్మేట్ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా అమన్‌రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్‌ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్‌లో అమన్ దుమ్ములేపుతున్నాడు. -
VHT: ‘వన్డే’లో ‘కరీంనగర్’ కుర్రాడి డబుల్ సెంచరీ
బెంగాల్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావు పేరాల ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నమెంట్లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. మొహమ్మద్ షమీ (Mohammed Shami) వంటి టీమిండియా సీనియర్ బౌలర్‌తో కూడిన పటిష్ట బెంగాల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ.. అజేయ ద్విశతకంతో దుమ్ములేపాడు.చరిత్ర సృష్టించిన అమన్ రావుతద్వారా హైదరాబాద్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా.. ఓవరాల్‌గా తొమ్మిదో ప్లేయర్‌గా అమన్ రావు చరిత్ర సృష్టించాడు. దేశీ వన్డే టోర్నీలో భాగంగా రాజ్‌కోట్ వేదికగా గ్రూప్-బి నుంచి బెంగాల్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతోఓపెనర్లు అమన్ రావు పేరాల, గహ్లోత్ రాహుల్ సింగ్ ఆది నుంచే బెంగాల్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 154 బంతులు ఎదుర్కొన్న అమన్ రావు 12 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 200 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరోవైపు.. రాహుల్ సింగ్ సైతం అర్థ శతకం (54 బంతుల్లో 65)తో మెరిశాడు.తిలక్ వర్మ విఫలమైనాఅయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (45 బంతుల్లో 34) మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మిగతా వారిలో అభిరథ్ రెడ్డి (5), ప్రణవ్ వర్మ (7) విఫలం కాగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ప్రజ్ఞయ్ రెడ్డి (22) ఓ మోస్తరుగా రాణించాడు.ఓవైపు వికెట్లు పడుతున్నా అమన్ రావు మాత్రం నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోరు అందించడంలో సఫలమయ్యాడు. అతడికి తోడుగా చామా మిలింద్ ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు సాధించింది.షమీ బౌలింగ్‌ను చితక్కొట్టాడుబెంగాల్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా.. షాబాజ్ అహ్మద్, రోహిత్ దాస్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా షమీ బౌలింగ్‌లో అమన్ రావు ఫోర్లు, వరుస సిక్సర్లతో చెలరేగడం విశేషం. అంతేకాదు ఆఖరి బంతికి ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో సిక్స్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకోవడం మరో విశేషం.కరీంనగర్ కుర్రాడుకాగా 21 ఏళ్ల అమన్ రావు స్వస్థంల కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో గల వెన్నంపల్లి గ్రామం. ఇటీవల ఐపీఎల్ మినీ వేలం-2026లో రాజస్తాన్ రాయల్స్ రూ. 30 లక్షల కనీస ధరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ను కొనుగోలు చేసింది.చదవండి: మూడోసారి తండ్రి అయిన అంబటి రాయుడు


