TG20 League: వైభవ్‌ టీమ్‌మేట్‌ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ | TG20 League 2026 1st Century: WAW Captain Aman Rao Scores 32 ball 100 | Sakshi
Sakshi News home page

TG20 League: వైభవ్‌ టీమ్‌మేట్‌ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ

Jun 22 2026 8:07 PM | Updated on Jun 23 2026 12:48 PM

TG20 League 2026 1st Century: WAW Captain Aman Rao Scores 32 ball 100

PC: TG20 X

తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వ‌రంగ‌ల్ వారియ‌ర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. 

మెద‌క్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ‌ను కూడా అత‌డు విడిచిపెట్ట‌లేదు. 7 ఓవ‌ర్ వేసిన తిల‌క్ బౌలింగ్‌లో అత‌డు 15 ప‌రుగులు పిండుకున్నాడు. ఈ క్ర‌మంలో అమ‌న్ రావు  కేవ‌లం 32 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా అమన్‌ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.

కాగా అమన్‌రావ్‌ ఐపీఎల్‌-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమ‌న్ రాజ‌స్తాన్ త‌ర‌పున అరంగేట్రం చేయ‌న‌ప్ప‌టికి జోఫ్రా ఆర్చ‌ర్ వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్న‌ అనుభ‌వం అత‌డికి బాగా కలిసొచ్చింది. వైభవ్‌ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్‌ రూమ్‌ను అమన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్‌ తరహాలోనే టీజీ 20 లీగ్‌లో అమన్‌ దుమ్ములేపుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement