వరంగల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన రంగారెడ్డి రైజర్స్‌ | TG20 League-Warangal Warriors Vs Ranga-Reddy-Risers Toss-Match Update | Sakshi
Sakshi News home page

వరంగల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన రంగారెడ్డి రైజర్స్‌

Jul 7 2026 6:57 PM | Updated on Jul 7 2026 8:49 PM

TG20 League-Warangal Warriors Vs Ranga-Reddy-Risers Toss-Match Update

టీజీ20 లీగ్‌లో భాగంగా మంగ‌ళ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా రెండో మ్యాచ్‌లో రంగారెడ్డి రైజ‌ర్స్‌, వ‌రంగ‌ల్ వారియ‌ర్స్ త‌ల‌ప‌డుతున్నాయి. టాస్‌ గెలిచిన రంగారెడ్డి రైజర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయింది. 9 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. 

సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో ఆరోన్‌ జార్జ్‌ (70), ఆదిత్య (54) ధాటిగా ఆడుతున్నారు. ఇక టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన రంగారెడ్డి రైజ‌ర్స్ మూడు విజ‌యాలు, మూడు ఓట‌ముల‌తో ఆరు పాయింట్లతో ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది. మ‌రోవైపు వ‌రంగ‌ల్ వారియ‌ర్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజ‌యంతో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. వ‌రంగ‌ల్ వారియ‌ర్స్‌కు ప్లేఆఫ్ అవ‌కాశాలు లేన‌ప్ప‌టికీ రంగారెడ్డి రైజ‌ర్స్‌కు మాత్రం కీల‌కం కానుంది. ఈ మ్యాచ్‌లో వ‌రంగల్‌పై రంగారెడ్డి భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవ‌కాశ‌ముంటుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement