తెలంగాణ టీ20 లీగ్ (టీజీ20)- 2026లో కరీంనగర్ డైమండ్స్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. వరంగల్ వారియర్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. కాగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముదస్సర్ బౌలింగ్‌లో ఓపెనర్ సాత్విక్ రెడ్డి సింగిల్ డిజిట్ స్కోరుకే (4) వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.
133 పరుగులు
ఈ క్రమంలో 52 బంతుల్లోనే వంద పరుగులు చేసుకున్న తన్మయ్.. మొత్తంగా 61 బంతులు ఎదుర్కొని పదిహేను ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు.
అయితే, కిరణ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో తన్మయ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది. వన్‌డౌన్ బ్యాటర్ హెచ్‌కే సింహ (24) ఫర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా పూర్తిగా నిరాశపరిచారు. వైస్ కెప్టెన్ చందన్ సహాని 16 పరుగులు చేయగా.. హరీశ్ ఠాకూర్ 1, శుభం శర్మ 2 (రిటైర్డ్ అవుట్) పరుగులకే నిష్క్రమించారు.
రాహుల్ రాధేశ్ 15, నారాయణ తేజ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కరీంనగర్ డైమండ్స్ 209 పరుగులు స్కోరు చేసింది. కాగా కరీంనగర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ ఓడిపోయింది. వరంగల్‌పై గెలిచి బోణీ కొట్టాలని పట్దుదలగా ఉంది.
తుదిజట్లు
కరీంనగర్ డైమండ్స్
సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్ (వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్
వరంగల్ వారియర్స్
హర్షిత్ చౌదరి, అమన్ రావు పేరాల (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్, పల్లెపాటి క్రాంతి.
Simply outstanding! 🤩
A ton to savour for Tanmay, standing up and leading the fight for his side! 💥
What a time to do it for the Diamonds! ⚡️#WWvKD #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/b3Cc3pqvEr— tg20official (@tg20official) June 28, 2026


