టీజీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం ఉప్పల్ వేదికగా 14వ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన వరంగల్ వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక వరంగ్ వారియర్స్ ఆడిన మూడింటిలో ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది.
మరోవైపు ఆడిన రెండింటిలోనూ ఓడిన కరీంనగర్ డైమండ్స్ ఆఖరి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లోనైనా గెలిచి కరీంనగర్ డైమండ్స్ టోర్నీలో బోణీ చేయాలని చూస్తుండగా, రెండో విజయంతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని వరంగల్ వారియర్స్ భావిస్తోంది.
తుదిజట్లు:
కరీంనగర్ డైమండ్స్: సాత్విక్ రెడ్డి , తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హెచ్‌కే సింహా , రాహుల్ రాధేష్(వికెట్ కీపర్), హరీష్ ఠాకూర్ , చందన్ సహాని , శుభం శర్మ , నారాయణ తేజ , ఆశిష్ శ్రీవాస్తవ్ , రత్లావత్ దినేష్ , పగడాల లోకేష్
వరంగల్ వారియర్స్: హర్షిత్ చౌదరి అమన్ రావు (కెప్టెన్), రిషికేత్ సిసోడియా, మురుగన్ అభిషేక్, భవేష్ సేథ్ (వికెట్‌కీపర్), ఆది మణి కిరణ్, ఎండీ ఆసిఫ్ మన్సూరి, శౌనక్ కులకర్ణి, ముదస్సర్ హుస్సేన్, అబ్దుల్ మాలిక్ప,ల్లెపాటి క్రాంతి


