తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.
మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం
ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్‌లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.
విజయం దిశగా మెదక్
మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6
తిలక్ వర్మ సెంచరీ
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్‌లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.
నాలుగో వికెట్ డౌన్
19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొదక్ మూడో వికెట్ డౌన్
మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4
తిలక్ హాఫ్ సెంచరీ
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2
దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ
259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.
వరంగల్ భారీ స్కోర్
ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్‌రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
మూడో వికెట్ డౌన్
వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
వరంగల్ రెండో వికెట్ డౌన్
వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్‌రావు పేరాల.. రాహుల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
లీగ్ తొలి సెంచరీ
అమన్‌రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.
వరంగల్ తొలి వికెట్ డౌన్
వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1
అమన్ ఫిప్టీ
వరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్‌లతో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్‌ప్లేలోనే వంద పరుగులు దాటింది.
దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లు
వరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.
తెలంగాణ టీ20 లీగ్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్‌గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.
మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్‌ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తుదిజట్లు
వరంగల్ వారియర్స్ అమన్‌రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.
మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె.


