సాక్షి, హైదరాబాద్: టిజి20 లీగ్‌లో సీవీ మిలింద్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఖమ్మం ఏసెస్ జట్టు మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి రైజర్స్‌పై గెలుపొందింది. మొదట రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
ఆదిత్య జవ్వాజి (37 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ప్రకాశ్ రెడ్డి (25 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఖమ్మం జట్టు సారథి మిలింద్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో 17.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులుచేసింది. హిమతేజ (28 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), మికిల్ జైస్వాల్ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు), మిలింద్ (21 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) సత్తాచాటడంతో ఖమ్మం సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో కరీంనగర్ డైమండ్స్‌పై గెలుపొందింది.


