కేబీఆర్‌ పార్క్‌ వన్‌ వే.. మార్పులివే.. | KBR Park One-Way Route Map Alert, Here Are The Revised TGSRTC Bus Routes And Bus Stops Details | Sakshi
Sakshi News home page

KBP Park One Way: కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ మారిన ప్రయాణమార్గాలు, బస్టాప్‌ల వివరాలు

Aug 19 2026 3:05 PM | Updated on Aug 19 2026 3:29 PM

KBR Park One Way: Bus Routes and Bus Stops full details

బస్సు రూట్లను క్రమబద్ధీకరించిన ఆర్టీసీ  

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిబంధనల అమలు
 

సాక్షి, హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, కేబీఆర్‌ పార్క్‌ పరిసర ప్రాంతాల్లో బస్సుల రూట్లను ఆర్టీసీ క్రమబద్ధీకరించింది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్‌–వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు వెల్లడించారు. కొండాపూర్‌– కోఠి (127 కే), పటాన్‌చెరు– కోఠి(222ఏ), మణికొండ–సికింద్రాబాద్‌(47ఎల్‌), కొండాపూర్‌– సికింద్రాబాద్‌ (10 హెచ్‌) రూట్లను క్రమబద్ధీకరించారు.  (KBR Park One Way Route Map)

మార్పులు ఇలా..
సికింద్రాబాద్‌ నుంచి మణికొండకు(47ఎల్‌) వెళ్లే బస్సు జేబీఎస్‌ నుంచి బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్, నాగార్జున సర్కిల్,ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్‌ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా హాస్పిటల్, అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, దర్గా మీదుగా మణికొండకు చేరుకుంటుంది.

⇒ తిరుగు ప్రయాణంలో మణికొండ, పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్‌ నగర్, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్‌ హాస్పిటల్, టీవీ9 (మసీద్‌), పంజాగుట్ట పోలీస్‌స్టేషన్, ఆర్‌.జె.కాలేజీ పోలీస్‌ లైన్, ప్లాజా మీదుగా సికింద్రాబాద్, జేబీఎస్‌కు చేరుకుంటుంది.  

⇒ సికింద్రాబాద్‌–కొండాపూర్‌ (10హెచ్‌) బస్సు సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ ఎక్స్‌ రోడ్స్, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ పోలీసు స్టేషన్‌ మీదుగా కొండాపూర్‌ చేరుకుంటుంది.

⇒ తిరుగు ప్రయాణంలో కొండాపూర్‌ నుంచి పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, మైత్రివనం, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

⇒ కోఠి– పటాన్‌చెరు (222ఏ) బస్సు కోఠి నుంచి లక్డీకాపూల్, మాసబ్‌ ట్యాంక్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్‌ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ పీఎస్‌ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది.

⇒ తిరుగు ప్రయాణంలో పటాన్‌చెరు నుంచి మాదాపూర్‌ పీఎస్, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్, నాగార్జున సర్కిల్, మాసబ్‌ ట్యాంక్, లక్డీకాపూల్‌ నుంచి కోఠికి చేరుకుంటుంది.  (KBR Park New Bus Routes)

చ‌ద‌వండి: కేబీఆర్ చుట్టూ వాహ‌న‌దారుల‌కు చుక్క‌లు

⇒ కోఠి– కొండాపూర్‌ (127 కే) బస్సు కోఠి నుంచి లక్డీకాపూల్, మాసబ్‌ ట్యాంక్, పెన్షన్‌ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి, రోడ్డు నంబర్‌– 45, మాదాపూర్‌ పీఎస్‌ మీదుగా కొండాపూర్‌ చేరుకుంటుంది.

⇒ తిరుగు ప్రయాణంలో కొండాపూర్‌ నుంచి మాదాపూర్‌ పీఎస్, రోడ్డు నంబర్‌– 45, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్‌ఎస్‌ భవన్, ఎమ్మెల్యే కాలనీ, పెన్షన్‌ హౌస్, మాసబ్‌ ట్యాంక్‌ నుంచి కోఠికి చేరుకుంటుంది.  

⇒ జూబ్లీహిల్స్, ఫిల్మ్‌ నగర్, బంజారాహిల్స్, రోడ్‌ నంబర్‌– 45, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ మారిన బస్సు రూట్లకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని అధికారులు కోరారు.

⇒ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement