breaking news
one way
-
KBR Park: ఇక అదే దారి
హైదరాబాద్: కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కుల తొలగింపునకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడేసి చొప్పున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మించాలని తలపెట్టింది. ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ వన్‌వే అమలు చేసింది. దీనికోసం చేసిన మార్పులు చేర్పులతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. దీంతో అధికార యంత్రాంగం రూ.1,250 కోట్లు వెచ్చించి.. ఏళ్లు శ్రమించి ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం కంటే శాశ్వత ప్రాతిపదికన వన్‌వే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డు నెం.36 వరకు లేదా రోడ్డు నెం.45 వరకు ఇది ఉండాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరాయి. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాహన చోదకుల ఫీడ్‌బ్యాక్.. ‘హెచ్–సిటీ’ పనుల్లో భాగంగా అధికారులు గత నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేశారు. ఇది అమల్లోకి వచి్చన పది రోజుల్లోనే ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గి ఫలితాలు కనిపించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నామంటూ వాహన చోదకుల నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్లు వన్‌వే అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ విధానం శాశ్వతం చేయాలని నిర్ణయించారు. మరోపక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి యంత్రాగానికి సవాళ్లు ఎదురయ్యాయి. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ కేబీఆర్ పార్కు వాకర్లతో పాటు పర్యావరణవేత్తలు, సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ™ దీంతో పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. పలు పరిణామాలతో.. చెట్లను కొట్టివేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉండటంతో సదరు నిర్మాణ రంగ సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు ఎన్నిచెట్లు మిగిలి ఉన్నాయో వాటి జియో ట్యాగ్‌ను కూడా పర్యావరణవేత్తలు తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వీల్లేకుండాపోయింది. దీనికి తోడు ఈ నిర్మాణాల కోసం మొత్తం 247 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో పలువురు ప్రము ఖులవీ ఉన్నాయి. ఈ కారణంగా వీటి సేకరణ పెను సవాల్‌గా మారింది. పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కేబీఆర్ పార్కుకు నిర్ణయించిన ఎకో సెన్సిటివ్ జోన్‌పై సుప్రీం కోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ పరిణామాలకు శాశ్వత వన్ వే ఓ పరిష్కారం చూపింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ వన్‌వేలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హెచ్–సిటీ పనులు ఆగిపోయాయి. ఈ పనులతో పోలిస్తే ఎలివేటెడ్ కారిడార్‌కు చాలా తక్కువే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం! -
కేబీఆర్ పార్క్ వన్ వే.. మార్పులివే..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో బస్సుల రూట్లను ఆర్టీసీ క్రమబద్ధీకరించింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్–వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్టాప్‌లు, స్టేజీల వివరాలను అధికారులు వెల్లడించారు. కొండాపూర్– కోఠి (127 కే), పటాన్చెరు– కోఠి(222ఏ), మణికొండ–సికింద్రాబాద్(47ఎల్), కొండాపూర్– సికింద్రాబాద్ (10 హెచ్) రూట్లను క్రమబద్ధీకరించారు. (KBR Park One Way Route Map)మార్పులు ఇలా..⇒ సికింద్రాబాద్ నుంచి మణికొండకు(47ఎల్) వెళ్లే బస్సు జేబీఎస్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్, నాగార్జున సర్కిల్,ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా హాస్పిటల్, అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, దర్గా మీదుగా మణికొండకు చేరుకుంటుంది.⇒ తిరుగు ప్రయాణంలో మణికొండ, పంచవటి కాలనీ, దర్గా, ఫిల్మ్ నగర్, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్ హాస్పిటల్, టీవీ9 (మసీద్), పంజాగుట్ట పోలీస్‌స్టేషన్, ఆర్.జె.కాలేజీ పోలీస్ లైన్, ప్లాజా మీదుగా సికింద్రాబాద్, జేబీఎస్‌కు చేరుకుంటుంది. ⇒ సికింద్రాబాద్–కొండాపూర్ (10హెచ్) బస్సు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ ఎక్స్ రోడ్స్, వెంకటగిరి, నవయుగ, పెద్దమ్మగుడి, మాదాపూర్ పోలీసు స్టేషన్ మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది.⇒ తిరుగు ప్రయాణంలో కొండాపూర్ నుంచి పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, యూసుఫ్‌గూడ, మైత్రివనం, బేగంపేట మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. ⇒ కోఠి– పటాన్చెరు (222ఏ) బస్సు కోఠి నుంచి లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, నాగార్జున సర్కిల్, ఎల్వీ ప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, ఒమేగా, అపోలో ఆస్పత్రి, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్ పీఎస్ మీదుగా పటాన్‌చెరుకు చేరుకుంటుంది.⇒ తిరుగు ప్రయాణంలో పటాన్చెరు నుంచి మాదాపూర్ పీఎస్, పెద్దమ్మగుడి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్, నాగార్జున సర్కిల్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి కోఠికి చేరుకుంటుంది. (KBR Park New Bus Routes)చదవండి: కేబీఆర్ చుట్టూ వాహనదారులకు చుక్కలు⇒ కోఠి– కొండాపూర్ (127 కే) బస్సు కోఠి నుంచి లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్, పెన్షన్ హౌస్, ఎమ్మెల్యే కాలనీ, అపోలో ఆస్పత్రి, రోడ్డు నంబర్– 45, మాదాపూర్ పీఎస్ మీదుగా కొండాపూర్ చేరుకుంటుంది.⇒ తిరుగు ప్రయాణంలో కొండాపూర్ నుంచి మాదాపూర్ పీఎస్, రోడ్డు నంబర్– 45, జర్నలిస్ట్ కాలనీ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, అన్నపూర్ణ స్టూడియో, ఎల్వీప్రసాద్, బసవతారకం హాస్పిటల్, బీఆర్ఎస్ భవన్, ఎమ్మెల్యే కాలనీ, పెన్షన్ హౌస్, మాసబ్ ట్యాంక్ నుంచి కోఠికి చేరుకుంటుంది. ⇒ జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్– 45, పరిసర ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ మారిన బస్సు రూట్లకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.⇒ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నేటి నుంచే కేబీఆర్ చుట్టూ వన్‌వే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటి (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి 360 డిగ్రీల వన్‌వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ‘హెచ్–సిటీ’ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో చేపడుతున్న ఈ ట్రాఫిక్ మార్పులు దాదాపు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి. వాహనదారులు కొత్త మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో అవసరమైన అప్డేట్లు చేశారు. వన్‌వే అమలును పర్యవేక్షించేందుకు 450 మంది ట్రాఫిక్ సిబ్బందిని మోహరించనున్నారు. కీలక ప్రాంతాల్లో 24 గంటలూ ట్రాఫిక్, పోలీసు సిబ్బంది అందుబాటులో ఉంటారు.వన్‌వే విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వాహనదారులు ఏర్పాటు చేసిన సైనేజ్ బోర్డులను గమనిస్తూ నిర్దేశించిన మార్గాల్లోనే ప్రయాణించాలి. అవసరమైన చోట్ల మాత్రమే లేన్ మార్చుకోవాలని పోలీసులు సూచించారు.13 లైన్ ఛేంజర్లు.. 10 ఎగ్జిట్లువాహనదారులకు మార్గమధ్యలో ఇబ్బందులు లేకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ 13 లైన్ ఛేంజర్లు, 10 ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీ, వాహనాల కదలికలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు.రెండుసార్లు పైలట్ ట్రయల్స్ తర్వాతే..వన్‌వే విధానాన్ని అమలు చేయడానికి ముందు రెండుసార్లు పైలట్ ట్రయల్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్‌లో ఎదురైన సమస్యలు, ట్రాఫిక్ కదలికలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసిన అనంతరం ఆగస్టు 18 నుంచి వన్‌వేను అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వాహనదారులకు మార్గనిర్దేశం చేసేందుకు కీలక ప్రాంతాల్లో 24/7 ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.రాంగ్‌రూట్‌పై కఠిన చర్యలువన్వే నిబంధనలను ఉల్లంఘిస్తూ రాంగ్‌సైడ్‌లో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. నిర్ణయించిన మార్గాలు, ఫ్రీ-లెఫ్ట్ సదుపాయాలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ట్రాఫిక్ తక్కువగా ఉందని అతివేగంగా ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరించారు.వాకర్స్, విజిటర్స్‌కు ప్రత్యేక పార్కింగ్కేబీఆర్ పార్క్‌కు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. పార్క్ పరిసరాల్లో వన్‌వే కారణంగా ఏర్పడే మార్పులను ముందుగానే తెలుసుకుని ప్రయాణం చేసుకోవాలని అధికారులు సూచించారు.హెచ్–సిటీ పూర్తయితే ట్రాఫిక్‌కు భారీ ఊరటకేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న హెచ్–సిటీ ప్రాజెక్టులో భాగంగా భారీ స్థాయిలో అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. పనులు పూర్తయితే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, రోడ్ నంబర్ 45, ఫిలింనగర్, అగ్రసేన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వద్ద ప్రయాణ ఇబ్బందులు 100 శాతం వరకు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 80 శాతం వరకు తగ్గుతాయని సీపీ సజ్జనార్ తెలిపారు.వాహనదారులు గుర్తుంచుకోవాల్సినవివన్వే ప్రారంభం: ఆగస్టు 18, ఉదయం 6 గంటల నుంచిఅమలు: సుమారు రెండేళ్లువిధానం: కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్వేలైన్ ఛేంజర్లు: 13ఎగ్జిట్లు: 10ట్రాఫిక్ సిబ్బంది: 450 మందిరాంగ్సైడ్ డ్రైవింగ్‌పై: కఠిన చర్యలుగూగుల్ మ్యాప్స్: కొత్త రూట్లకు అనుగుణంగా అప్డేట్కొత్త ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ముందుగానే తమ ప్రయాణ మార్గాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. -
ఎక్కడికైనా క్యాబ్ రెడీ!
ఇంత వరకు సిటీకే పరిమితమైన క్యాబ్ సర్వీసులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా సరే పరుగుకు సిద్ధమంటున్నాయి. వీకెండ్లో టూర్‌కు వెళుతున్నా.. వారం రోజుల పాటు ఇంటిల్లిపాదీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధపడినా సరే ఇప్పుడు క్యాబ్ అందుబాటులో ఉంది. బుక్ చేసిన గంటలోగా ఇంటికి వచ్చేస్తుంది. సొంత వాహనం అనుభూతితో ప్రయాణం చేయవచ్చు. నగరంలో క్యాబ్సేవలు అందిస్తున్న ‘ఓలా’ సంస్థ ఇప్పుడు ‘అవుట్ స్టేషన్ సర్వీస్’లను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలకు, పర్యాటక ప్రాంతాలకు ఈ క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వేసవి రద్దీ దృష్ట్యా ప్రతిరోజు సుమారు 10 వేల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అవుట్ స్టేషన్ క్యాబ్‌లను ఎంపిక చేసుకుంటున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికుల అభిరుచికి అనుగుణమైన కార్లను ఇంటర్సిటీ సర్వీసులుగా నడుపుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాలు, జిల్లా కేంద్రాలకు క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఓలా.. మరో 600 నగరాలకు వన్‌వే ట్రిప్పులను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, తిరుపతి, ఏలూరు, చిత్తూరు, కడప, వరంగల్, శ్రీశైలం తదితర ప్రధాన కేంద్రాలకు వన్‌వే ట్రిప్పులను, వీకెండ్ క్యాబ్ సర్వీసులను ప్రవేశపెట్టింది. ఓలా యాప్ నుంచే ఈ అవుట్ స్టేషన్ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ‘అవుట్ స్టేషన్’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే అన్ని వివరాలు మొబైల్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలనే అంశాన్ని ఎంపిక చేసుకొంటే అందుకు చెల్లించవలసిన చార్జీలు కూడా తెలిసిపోతాయి. చార్జీల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవల నిర్వహణ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. వన్‌వే ట్రిప్పులతో పాటు, 12 గంటల ట్రిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాబ్ బుక్ చేసుకున్న గంట వ్యవధిలోనే క్యాబ్ ఇంటికి ముందుకు వచ్చి వాలుతుంది. అంతేకాదు 7 రోజుల ముందే బుక్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. వెళ్లాల్సిన ప్రయాణికుల సంఖ్య, కావలసిన సదుపాయాలకు అనుగుణంగా సెడాన్, ఎస్యూవీ, లగ్జరీ వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. దేని చార్జీలు దానికే విడిగా ఉంటాయి. పూర్తి ఏసీ సదుపాయంతో, వినోదభరితమైన ప్రయాణ సదుపాయాన్ని అందజేస్తారు. వన్‌వే ట్రిప్పులు, వీకెండ్ టూర్లు కూడా సిద్ధం చేశారు. అవుట్ స్టేషన్ సర్వీసులను గత సంవత్సరమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రస్తుతం అన్ని ప్రధాన నగరాలకు వాటిని విస్తరించడంతో డిమాండ్ పెరిగినట్లు ఓలా ప్రతినిధి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ప్రయాణికులకు పూర్తి భద్రత.. ఓలా యాప్ నుంచి బుక్ చేసుకొనే అవుట్ స్టేషన్ సర్వీసుల్లో అన్ని భద్రతా సదుపాయాలు ఉన్నాయి. డ్రైవర్ అనుభవం, డ్రైవింగ్ లైసెన్సు, వాహనం వివరాలతో పాటు ఏ క్షణంలోనైనా రక్షణ కోరేందుకు ప్యానిక్ బటన్ సైతం ఏర్పాటు చేశారు. జీపీఎస్‌తో అనుసంధానం చేయడం వల్ల అవుట్ స్టేషన్ క్యాబ్‌ల్లో కూడా వెహికల్ ట్రాకింగ్ మూవ్మెంట్ తెలుస్తుంది. 24 గంటలూ భద్రతా సదుపాయం ఉంటుంది. -
రత్నగిరిపై వాహనాలకు ‘వన్ వే’
అన్నవరం : కార్తీక మాసంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో వాహనాల రాకపోకలకు వన్‌వే ఏర్పాటు చేశారు. రత్నగిరికి చేరుకునేందుకు, కొండ దిగువకు వచ్చేందుకు వేర్వేరుగా రెండు ఘాట్‌రోడ్లు ఉన్నాయి. తాజాగా రత్నగిరిపై కూడా వన్‌వే అమలు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఆలయానికి వెళ్లే వాహనాలను ప్రకాష్ సదన్ సత్రం వెనుక రోడ్డు ద్వారా సీఆర్ఓ కార్యాలయం వద్దకు మళ్లిస్తారు. కాగా స్వామివారి ప్రత్యేక దర్శనం (రూ.100) టిక్కెట్లను మంగళవారం నుంచి ఆన్‌లైన్‌కు అనుసంధానం చేస్తున్నారు. భక్తులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఇచ్చేందుకు తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం , ప్రధానాలయం వద్ద మూడు కౌంటర్లలో ఈ సదుపాయం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుంది. ఎంతమంది భక్తులు ప్రత్యేకదర్శనం టిక్కెట్లు కొనుగోలు చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. -
ప్రజలంతా వైయస్ఆర్సిపి వైపే ఉన్నారు
-
వైయస్ఆర్సిపిది ఒకే మాట ఒకే బాట


