అతడొక అద్భుతం.. భార‌త క్రికెట్‌ను ఏలుతాడు: గిల్‌ | Shubman Gill reaction after Galle Test win: Manav Suthar can play for India for a very long time | Sakshi
Sakshi News home page

అతడొక అద్భుతం.. భార‌త క్రికెట్‌ను ఏలుతాడు: గిల్‌

Aug 19 2026 2:54 PM | Updated on Aug 19 2026 3:42 PM

Shubman Gill reaction after Galle Test win: Manav Suthar can play for India for a very long time

PC: X

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా వెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

ఫస్ట్ డౌన్ బ్యాటర్‌ దేవదత్ పడిక్కల్(167 పరుగులు) అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం బౌలింగ్‌లో భారత స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఫలితంగా ఆతిథ్య జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. 

దీంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనప్పటికి.. తొలి ఇన్నింగ్స్ లభించిన ఆధిక్యాన్ని జోడించి శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. 

ఈ లక్ష్యాన్ని చేధించలేక శ్రీలంక 206 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ రాజస్తాన్ స్పిన్నర్ 6 వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో మానవ్ సుతార్‌పై భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు.

"మాన‌వ్ ఒక అద్భుతమైన స్పిన్న‌ర్‌. భార‌త్ త‌ర‌పున తొలి మ్యాచ్‌(అఫ్గానిస్తాన్‌)లోనే త‌న సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో కూడా అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డికి మంచి భ‌విష్యత్తు ఉంది. అత‌డు క‌చ్చితంగా భార‌త జ‌ట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వ‌హిస్తాడు. ప‌డిక్క‌ల్ గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాలి. 

అత‌డు రెండు ఇన్నింగ్స్‌ల‌లోనూ అత్యుత్త‌మంగా రాణించాడు. అత‌డి బ్యాటింగ్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం సెంచరీ చేయడమే కాకుండా, ఆ తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టును మంచి పొజిషేన్‌లో నిలిపాడు.  రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను అతడు ఎదుర్కొన్న తీరు, ఆధిపత్యం చెలాయించిన విధానం మ్యాచ్ మొత్తానికే హైలైట్ అని గిల్ పేర్కొన్నాడు.

అదేవిధంగా రెండో ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ స్పందించాడు. "వాతావరణ పరిస్థితుల వల్ల 4వ, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతుందో తెలియదు. అందుకు దూకుడుగా ఆడి ప్ర‌త్య‌ర్ది ముందు 400కు పైగా ల‌క్ష్యాన్ని ఉంచాల‌ని భావించాం. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా వికెట్లు కోల్పోయాం. 

దీని గురుంచి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. మేము అప్ప‌టికే మ్యాచ్‌పై ప‌ట్టు సాధించాం. ఇక . 600వ చారిత్రక టెస్టులో విజ‌యం సాధించ‌డం చాలా సంతోషంగా ఉంది. డ‌బ్ల్యూటీసీ రేసులో ప్ర‌తీ గెలుపు మాకు కీల‌కమ‌ని" శుబ్‌మ‌న్ వ్యాఖ్య‌నించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement