తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ | tanmay agarwal slams century for HCA | Sakshi
Sakshi News home page

తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ

Aug 25 2017 10:37 AM | Updated on Sep 17 2017 5:58 PM

తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ

తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ

ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో హెచ్‌సీఏ ఎలెవన్‌ బ్యాట్స్‌మన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (127 బంతుల్లో 131; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు.

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో హెచ్‌సీఏ ఎలెవన్‌ బ్యాట్స్‌మన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (127 బంతుల్లో 131; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్‌తో పాటు బౌలర్లు కూడా రాణించడంతో ‘కాగ్‌’ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో హెచ్‌సీఏ 163 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ ఎలెవన్‌ 50 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది.  అక్షత్‌ రెడ్డి (80), కె. సుమంత్‌ (73), ఆశిష్‌ రెడ్డి (58) అర్ధసెంచరీలతో రాణించారు.

ప్రత్యర్థి బౌలర్లలో ఇంతియాజ్‌ అహ్మద్, అక్షయ్, పునీత్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ‘కాగ్‌’ జట్టు తడబడింది. హెచ్‌సీఏ బౌలర్లు సీవీ మిలింద్‌ (2/37), మెహదీ హసన్‌ (3/26), ముదస్సిర్‌ హుస్సేన్‌ (2/32) ధాటికి 40.4 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పునీత్‌ యాదవ్‌ (40), బిపుల్‌ శర్మ (33) పోరాడారు. ఆకాశ్‌ భండారీకి ఒక వికెట్‌ దక్కింది.  ఇతర మ్యాచ్‌లలో ఆంధ్ర 82 పరుగులతో విదర్భపై, ఎయిరిండియా 17 పరుగులతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌పై, కేరళ 181 పరుగులతో కంబైన్డ్‌ డిస్ట్రిక్ట్స్‌పై విజయం సాధించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement