కరీంనగర్‌ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే? | TG20 League 2026 KAD vs RRR: Toss Playing XIs Updates | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?

Jul 2 2026 2:08 PM | Updated on Jul 2 2026 4:12 PM

TG20 League 2026 KAD vs RRR: Toss Playing XIs Updates

తన్మయ్‌- తనయ్‌ (PC: TG20 X)

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌- 2026లో భాగంగా గురువారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో కరీంనగర్‌ డైమండ్స్‌- రంగారెడ్డి రైజర్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌ వేదికగా రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన రంగారెడ్డి మొదట బౌలింగ్‌ ఎంచుకోగా.. కరీంనగర్‌ బ్యాటింగ్‌కు దిగింది.

కరీంనగర్‌ భారీ స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
ఓపెనర్లు సాత్విక్‌ రెడ్డి (24), కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (29) ఫర్వాలేదనిపించగా.. సింహా, రాహుల్‌ రాదేశ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సింహా 38 బంతుల్లోనే 60 పరుగులు చేయగా.. రాహుల్‌ 37 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. 

చందన్‌ సహానీ (19), శుభం శర్మ (17 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా నిర్నీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కరీంనగర్‌ 230 పరుగులు సాధించింది. రంగారెడ్డి బౌలర్లలో తనయ్‌ జడ్డు రెండు వికెట్లు తీయగా.. తనయ్‌ త్యాగరాజన్‌, నితిన్‌ సాయి యాదవ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

తుదిజట్లు
కరీంనగర్‌ డైమండ్స్‌
తన్మయ్‌ అగర్వాల్‌ (కెప్టెన్‌), హెచ్‌కే సింహ, రాహుల్‌ రాదేశ్‌ (వికెట్‌ కీపర్‌), చందన్‌ సహానీ, టీవీఎస్‌ నారాయణ తేజ, హరీశ్‌ ఠాకూర్‌, శుభం శర్మ, రత్లావత్‌ దినేశ్‌, ఆశిష్‌ శ్రీవాస్తవ్‌, సతీశ్‌ కుమార్‌.

రంగారెడ్డి రైజర్స్‌
తనయ్‌ త్యాగరాజన్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జార్జ్‌ వర్గీస్‌, అవినాశ్‌ రావు (వికెట్‌ కీపర్‌), అలంకృత్‌ రాపోల్‌, జ్ఞానప్రకాశ్‌ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్‌ సాయి యాదవ్‌, నానావత్‌ రాకేశ్‌, అరుణ్‌ కుమార్‌, తనయ్‌ జడ్డు, ఆర్యన్‌ కరియప్ప.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement