ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్ సన్నద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన పాక్ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ ఆగస్టు 19 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌కు ముందు పాక్‌కు గుడ్ న్యూస్ అందింది. ప్రొఫెషనల్ కౌంటీ క్లబ్ సెలెక్ట్ XI జట్టుతో వార్మాప్ మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లీష్ పేసర్ లమ్స్‌డెన్ వేసిన బంతి బాబర్ కుడిచేతికి బలంగా తాకింది.
దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో ఆజం కేవలం 5 పరుగుల వద్దే రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్‌కు కూడా అతడు దూరమయ్యాడు. దీంతో తొలి టెస్టుకు దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ బాబర్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో లీడ్స్ టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నాడు. వైద్య బృందం పరీక్షించి అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెడింగ్లీ మైదానంలో బాబర్ తీవ్రంగా శ్రమిస్తూ కెమరాలకు చిక్కాడు. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్నాడు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరగనుంది.
చదవండి: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్ దేవ్ సరసన


