రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్‌ దేవ్‌ సరసన | Ravindra Jadeja Joins Elite Test All-Rounders Club with 350 Wickets | Sakshi
Sakshi News home page

రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. కపిల్‌ దేవ్‌ సరసన

Aug 17 2026 4:36 PM | Updated on Aug 17 2026 4:54 PM

Ravindra Jadeja Joins Kapil Dev in Elite All-Rounders Club

PC: X

గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త సాధించాడు. జ‌డ్డూ త‌న‌ టెస్ట్ కెరీర్‌లో 350వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. త‌ద్వారా టెస్టు క్రికెట్‌లో 4,000 వేల ప‌రుగుల‌తో పాటు 350 వికెట్లు సాధించిన నాలుగో ఆల్‌రౌండ‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. 

ఈ జాబితాలో అత‌డి కంటే ముందు కపిల్ దేవ్(5,248 రన్స్, 434 వికెట్లు), డానియ‌ల్ వెట్టోరి(4,531 రన్స్, 362 వికెట్లు), ఇయాన్ బోథ‌మ్ (5,200, 383 వికెట్లు) వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు ఉన్నారు. జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో 4,108 ప‌రుగుల‌తో పాటు 350 వికెట్లు సాధించాడు. 

అదేవిధంగా టెస్టుల్లో 350 వికెట్ల ఘనతను అందుకున్న ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. అనిల్‌ కుంబ్లే(619), రవిచంద్రన్‌ అశ్విన్‌(537), కపిల్‌ దేవ్‌(434), హార్బజన్‌ సింగ్‌(417) వంటి లెజెండరీ ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన  మూడో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌గా జడ్డూ భాయ్‌ కొనసాగుతున్నాడు. 

అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్లు వీరే
433 - రంగన హెరాత్
362 - డేనియల్ వెటోరి
350* - రవీంద్ర జడేజా
297 - డెరెక్ అండర్‌వుడ్
271 - తైజుల్ ఇస్లాం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement