సీఎస్‌కేకు బిగ్‌ షాకిచ్చిన పంజాబ్‌.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం | IPL 2024: Punjab Kings beat CSK by 7 wickets | Sakshi
Sakshi News home page

IPL 2024: సీఎస్‌కేకు బిగ్‌ షాకిచ్చిన పంజాబ్‌.. 7 వికెట్ల తేడాతో విజయం

May 1 2024 11:28 PM | Updated on May 2 2024 9:24 AM

IPL 2024: Punjab Kings beat CSK by 7 wickets

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ ఊహించని షాకిచ్చింది. చెపాక్‌ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

48 బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్‌.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేశాడు. పంజాబ్‌ బౌలర్లలో పంజాబ్ బౌలర్లలో హార్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహ‌ర్ త‌లా రెండు వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడ త‌లా వికెట్ సాధించారు.

బెయిర్‌ స్టో, రోసౌ విధ్వంసం..
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. పంజాబ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో, ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు రుసౌ విధ్వంసం సృష్టించారు. 

బెయిర్‌ స్టో 46 పరుగులు చేయగా.. రుసౌ 43 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు కెప్టెన్‌ సామ్‌ కుర్రాన్‌(27), శశాంక్‌ సింగ్‌(25) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. సీఎస్‌కే బౌలర్లలో శివమ్‌ దూబే,శార్ధూల్‌ ఠాకూర్‌, గ్లీసన్‌ తలా వికెట్‌ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement