CSK Vs MI: రుతురాజ్‌ అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు! వీడియో | IPL 2024 CSK Vs MI: Ruturaj Gaikwad Becomes Fastest Indian To Reach 2,000 IPL Runs, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs MI: రుతురాజ్‌ అరుదైన రికార్డు.. కోహ్లి, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు! వీడియో

Published Mon, Apr 15 2024 6:40 AM

Ruturaj Gaikwad becomes fastest Indian to reach 2,000 IPL runs - Sakshi

టీమిండియా యువ ఓపెనర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యం​త వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా గైక్వాడ్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసిన రుతు.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

కేవలం 57 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్‌ 2,021 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీతో పాటు 16 ఫిప్టీలు ఉన్నాయి. అదే విధంగా ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రుతురాజ్‌ నిలిచాడు.

ఈ జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు క్రిస్ గేల్ , షాన్ మార్ష్ ఉన్నారు. ఇక ఈ ఏడాది సీజన్‌లో గైక్వాడ్‌ కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఏడాది సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ 224 పరుగులు చేశాడు. అతడి సారథ్యంలో సీఎస్‌కే 6 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్దానంలో కొనసాగుతోంది.

Advertisement
Advertisement