భారత్‌ ‘సి’తో మ్యాచ్‌.. ఇండియా ‘బి’ దీటైన జవాబు | India B 124/0 After India C Pile Up 525 | Sakshi
Sakshi News home page

DT 2024: భారత్‌ ‘సి’తో మ్యాచ్‌.. ఇండియా ‘బి’ దీటైన జవాబు

Published Sat, Sep 14 2024 8:27 AM | Last Updated on Sat, Sep 14 2024 9:01 AM

India B 124/0 After India C Pile Up 525

సాక్షి, అనంతపురం: టాపార్డర్, లోయర్‌ ఆర్డర్‌ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యాట్‌కు పని చెప్పడంతో... అనంతపురంలో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లో పరుగుల వరద పారుతోంది. భారత్‌ ‘సి’తో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘బి’ 36 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 124 పరుగులు సాధించింది. 

కెప్టెన్‌అభిమన్యు ఈశ్వరన్‌ (91 బంతుల్లో 51 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), జగదీశన్‌ (126 బంతుల్లో 67 బ్యాటింగ్‌) హాఫ్‌ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న భారత్‌ ‘బి’ ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 401 పరుగులు వెనుకబడి ఉంది. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 357/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘సి’ 124.1 ఓవర్లలో 525 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (74 బంతుల్లో 58; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మానవ్‌ సుతార్‌ (156 బంతుల్లో 82; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖర్లో అన్షుల్‌ కంబోజ్‌ (27 బంతుల్లో 38; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. భారత్‌ ‘బి’ బౌలర్లలో ముకేశ్‌ కుమార్, రాహుల్‌ చాహర్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ‘సి’ తొలి ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (బి) ముకేశ్‌ 58; సాయి సుదర్శన్‌ (సి) నవ్‌దీప్‌ సైనీ (బి) ముకేశ్‌ 43; రజత్‌ పాటిదార్‌ (బి) నవ్‌దీప్‌ సైనీ 40; ఇషాన్‌ కిషన్‌ (బి) ముకేశ్‌ 111; బాబా ఇంద్రజిత్‌ (బి) రాహుల్‌ చహర్‌ 78; అభిషేక్‌ పొరేల్‌ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్‌ 12; మానవ్‌ సుతార్‌ (బి) రాహుల్‌ చహర్‌ 82; మయాంక్‌ మార్కండే (బి) నితీశ్‌ కుమార్‌ రెడ్డి 17; అన్షుల్‌ (బి) రాహుల్‌ చహర్‌ 38; విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ (సి) ఈశ్వరన్‌ (బి) రాహుల్‌ చహర్‌ 12; సందీప్‌ వారియర్‌ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం (124.1 ఓవర్లలో ఆలౌట్‌) 525. 

వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345, 6–382, 7–406, 8–461, 9–489, 10–525, బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 32–4–126–4; సైనీ 23–3–101–1; వాషింగ్టన్‌ సుందర్‌ 18–1–67–0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి 17–2–69–1; సాయికిశోర్‌ 18–2–78–0; రాహుల్‌ చహర్‌ 16.1–2–73–4. 

భారత్‌ ‘బి’ తొలి ఇన్నింగ్స్‌: అభిమన్యు ఈశ్వరన్‌ (బ్యాటింగ్‌) 51; జగదీశన్‌ (బ్యాటింగ్‌) 67; ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: (36 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 124. బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 1.1–0– 8–0; విజయ్‌ వైశాఖ్‌ 10–2–29–0; అన్షుల్‌ 8.5–2–30–0; మయాంక్‌ మార్కండే 5–0–18–0; మానవ్‌ సుతార్‌ 10–0–34–0.
చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచ‌కోత‌.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement