ఇండియా-సికి బిగ్ షాక్‌.. రుతురాజ్‌కు గాయం | Ruturaj Gaikwad retires hurt on 2nd ball of India B vs C match | Sakshi
Sakshi News home page

DT 2024: ఇండియా-సికి బిగ్ షాక్‌.. రుతురాజ్‌కు గాయం

Sep 12 2024 11:49 AM | Updated on Sep 12 2024 2:00 PM

Ruturaj Gaikwad retires hurt on 2nd ball of India B vs C match

రుతురాజ్‌ గైక్వాడ్‌(ఫైల్‌ ఫోటో)

దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. అనంతపురం వేదిక‌గా ఇండియా బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్‌, భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చాడు. 

తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ రెండో బంతికే గాయ‌ప‌డి గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ మ్యాచ్‌ టెలికాస్ట్ లేనందున అత‌డికి ఏమైంద‌న్న విష‌యం బయటకు రాలేదు. 

కాగా ఆదిలోనే  గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో ఇండియా-సి జట్టు బాధ్యతను పాటిదార్‌, సాయిసుదర్శన్ తమ భుజాలపై వేసుకున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. సుదర్శన్‌(39), రజిత్ పాటిదార్‌(35) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.

తుది జట్లు
ఇండియా సి: అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్

ఇండియా బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), నితీష్ కుమార్ రెడ్డి, ముఖేష్ కుమార్, ముషీర్ అహ్మద్ ఖాన్, నారాయణ్ జగదీసన్ (వికెట్ కీప‌ర్‌), నవదీప్ సైనీ, రాహుల్ చాహర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రింకు సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే.. ఒకే జ‌ట్టులో విరాట్ కోహ్లి, బాబ‌ర్ ఆజం?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement