టీమిండియాలో నో ఛాన్స్‌.. అక్క‌డ మాత్రం కెప్టెన్‌గా ఎంపిక‌! ఎవ‌రంటే? | Maharashtra Appoints Ruturaj Gaikwad As The Captain For The 2024–25 Ranji Trophy Season, Check Squad Details | Sakshi
Sakshi News home page

టీమిండియాలో నో ఛాన్స్‌.. అక్క‌డ మాత్రం కెప్టెన్‌గా ఎంపిక‌! ఎవ‌రంటే?

Jul 25 2024 9:02 PM | Updated on Jul 26 2024 10:41 AM

Maharashtra appoints Ruturaj Gaikwad as the captain for the 2024–25 Ranji Trophy season

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు 28 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును మ‌హారాష్ట్ర క్రికెట్ ఆసోషియేష‌న్ ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఎంసీఏ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా స్టార్ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంసీఏ నియ‌మించింది. గ‌త సీజ‌న్‌లో మ‌హారాష్ట్ర జ‌ట్టుకు సారథ్యం వ‌హించిన కేదార్ జాద‌వ్‌.. ఈ ఏడాది జూన్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. 

ఈ క్ర‌మంలోనే మహారాష్ట్ర జ‌ట్టు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక‌య్యాడు. గ‌త రంజీ సీజ‌న్‌లో మహారాష్ట్ర జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. దీంతో ఈ ఏడాది సీజ‌న్‌లో కొత్త కెప్టెన్‌, కోచ్‌తో మ‌హారాష్ట్ర బ‌రిలోకి దిగనుంది. మహారాష్ట్ర హెడ్‌కోచ్‌గా సులక్షణ కులకర్ణి  వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

గ‌తంలో త‌మిళ‌నాడు జ‌ట్టుకు సుల‌క్ష‌ణ కోచ్‌గా పనిచేశాడు. ఇక రుతురాజ్ కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది. అత‌డు ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర జ‌ట్టుకు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో సార‌థ్యం వ‌హిస్తున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా రుతురాజ్ ఉన్నాడు.

 అంతేకాకుండా అత‌డి సార‌థ్యంలోనే భార‌త జ‌ట్టు ఆసియాక్రీడ‌ల్లో గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకుంది. రుతురాజ్ చివ‌ర‌గా భార‌త త‌ర‌పున జింబాబ్వే సిరీస్‌లో ఆడాడు. ఈ సిరీస్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన‌ప్ప‌ట‌కి.. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు అత‌డికి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అత‌డిని కాద‌ని రియాన్ ప‌రాగ్‌, శివ‌మ్ దూబే వంటి వారికి చోటు ఇవ్వ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చానీయాంశ‌మైంది. ఇక రంజీ ట్రోఫీ 2024-25 సీజ‌న్ ఆక్టోబ‌ర్ 14 నుంచి ప్రారంభం కానుంది.

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు మహారాష్ట్ర జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), సౌరభ్ నవాలే, అంకిత్ బవానే, మందార్ భండారీ,  నిఖిల్ నాయక్,  హితేష్ వాలుంజ్, సిద్ధేష్ వీర్, విక్కీ ఓస్త్వాల్, సచిన్ దాస్, సత్యజీత్ బచావ్, హర్షల్ కేట్, తరంజిత్‌సింగ్ ధిల్లాన్,  యశ్ క్షీర్‌హన్‌కర్ సోలంకి, ప్రశాంత్ రాజ్‌కర్ సోలంకి, రాజ్‌కర్ సోలంకి,  రాహుల్ త్రిపాఠి, రామకృష్ణ ఘోష్, దిగ్విజయ్ పాటిల్, ముఖేష్ చౌదరి, అజీమ్ కాజీ, ప్రదీప్ దధే, సిద్ధార్థ్ మ్హత్రే, మనోజ్ ఇంగాలే, మెహుల్ పటేల్, రజనీష్ గుర్బానీ, ముర్తాజా ట్రంక్‌వాలా, వైభవ్ గోసావి.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement