
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అంశం హాట్‌హాట్‌గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్‌కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది.
ట్రేడ్ డీల్‌లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్‌కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్‌కు సీఎస్‌కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్‌బజ్ పేర్కొంది.
సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్‌కే రాయల్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్‌కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్‌తోనే కొనసాగాల్సి వస్తుంది.
సీఎస్‌కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్‌గా తెలుస్తుంది. రాయల్స్‌లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్‌కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి.
మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్‌కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు.