 
													ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. రుతురాజ్ అద్భుతమైన హాఫ్ సెంచరీ మెరిశాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రుతు 58 బంతుల్లో9 ఫోర్లతో 67 చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గైక్వాడ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. గత ఐదు ఏళ్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నిలిచాడు. గత సీజన్ వరకు చెన్నై సారథిగా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ గత ఐదు సీజన్లలో ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు.
సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని చివరగా 2019లో హాఫ్ సెంచరీ చేశాడు. అయితే 2022 సీజన్‌లో మిస్టర్ కూల్ హాఫ్ సెంచరీ నమోదు చేసినా.. అప్పుడు రవీంద్ర జడేజా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ధోని చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకుని రుతురాజ్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ను 7 వికెట్ల తేడాతో సీఎస్‌కే చిత్తు చేసింది.
They are 🔙 to winning ways 👍
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Chennai Super Kings 💛 remain unbeaten at home with a complete performance 👏👏
Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/16nzv4vt8b

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
