
ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్-2025లో పాకిస్తాన్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్ సత్తా చాటాడు. వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ (83 బంతుల్లో 55; 9 ఫోర్లు) చేశాడు (యార్క్‌షైర్). తద్వారా యార్క్‌షైర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్.. బెంజమిన్ క్లిఫ్ (8.3-0-46-5), మాథ్యూ రెవిస్ (8-3-26-2), జార్జ్ హిల్ (8-2-26-2), జాక్ వైట్ (10-1-21-1) ధాటికి 36.3 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. వార్విక్‌షైర్ ఇన్నింగ్స్‌లో వన్ష్ జానీ (82) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించారు. మిగతా వారిలో అలెక్స్ డేవిస్ (15), కై స్మిత్ (11), మైఖేల్ బూత్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన యార్క్‌షైర్ ఆదిలో తడబడింది. అయితే ఇమామ్ ఉల్ హాక్ (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టు గెలుపును ఖరారు చేశాడు. ఇమామ్‌కు విలియమ్ లక్స్ట్‌న్ (25), జేమ్స్ వార్టన్ (17), జార్జ్ హిల్ (20 నాటౌట్), హ్యారీ డ్యూక్ (10 నాటౌట్) సహకరించారు. వార్విక్‌షైర్ బౌలర్లలో భూత్‌కు 3, ఒలివర్ డాల్బీ, ఈథన్ బాంబర్‌కు తలో వికెట్ దక్కాయి.
రుతురాజ్‌కు ప్రత్నామ్నాయంగా వచ్చి..!
వాస్తవానికి ఈ టోర్నీకి ఇమామ్ ఉల్ హక్ ముందుగా ఎంపిక కాలేదు. వ్యక్తిగత కారణాల చేత టీమిండియా యువ ఆటగాడు వైదొలగడంతో అతని ప్రత్యామ్నాయంగా యార్క్‌షైర్‌లోకి వచ్చాడు. ఇమామ్ చివరిగా 2022లో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడాడు. అప్పుడతను సోమర్‌సెట్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం ఇమామ్ పాక్ జట్టులోనూ రెగ్యులర్ సభ్యుడిగా లేడు. ఫామ్ లేమి కారణంగా పాక్ సెలెక్టర్లు అతన్ని పక్కకు పెట్టారు.