త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ (SMAT 2025-26) కోసం 16 మంది సభ్యుల మహారాష్ట్ర జట్టును (Maharashtra) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు.
ఈ జట్టుకు సారధిగా రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఎంపికయ్యాడు. ఇటీవలే ముంబై నుంచి వలస వచ్చిన పృథ్వీ షాకు (Prithvi Shaw) ఈ జట్టులో చోటు దక్కింది. రుతురాజ్, షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ టోర్నీ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుండగా, అదే రోజు మహారాష్ట్ర తమ తొలి మ్యాచ్‌లో జమ్మూ అండ్ కశ్మీర్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో మహారాష్ట్ర ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛండీఘడ్, బిహార్, గోవా జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో మహారాష్ట్ర మొత్తం 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కోల్‌కతా వేదికగా జరుగనున్నాయి.
SMAT 2025-26 కోసం మహారాష్ట్ర జట్టు..
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), పృథ్వీ షా, అర్శిన్ కులకర్ణి, రాహుల్ త్రిపాఠి, నిఖిల్ నాయక్ (వికెట్‌కీపర్), రామకృష్ణ ఘోష్, విక్కీ ఓస్త్వాల్, తనయ్ సంఘ్వీ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, మందర్ బండారీ (వికెట్‌కీపర్), జలజ్ సక్సేనా, రాజవర్దన్ హంగార్గేకర్, యోగేశ్ డోంగరే, రంజిత్ నికమ్
చదవండి: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. ఉలిక్కిపడ్డ ప్లేయర్లు


