
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున అరంగేట్రం చేసేందుకు టీమిండియా ఆటగాడు, ముంబై మాజీ ఓపెనర్ పృథ్వీ షా సిద్దమవుతున్నాడు. బుచ్చి బాబు మల్టీ-డే టోర్నమెంట్ 2025 కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కింది. 25 ఏళ్ల పృథ్వీ షా ఇటీవలే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో తెగదింపులు చేసుకుని మహారాష్ట్రకు తన మకాంను మార్చాడు. ఇక బుచ్చి బాబు టోర్నీ కోసం మహారాష్ట్ర జట్టు కెప్టెన్‌గా అంకిత్ బావ్నేను సెలక్టర్లు నియమించారు.
మహారాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని బావ్నేకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. గత రంజీ సీజన్‌లో త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ గైర్హజరీలో బావ్నేనే జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ మహారాష్ట్ర తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్లలో రెండో ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సెలక్టర్లు గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం వెనక ఓ కారణముంది.
ఈ భారత ఓపెనర్ 2025-26 దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ జట్టుకు సెలక్ట్ చేశారు. ఆగస్టు 28న దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుందున, బుచ్చిబాబు టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు రుతు అందుబాటులో ఉండడు. అందుకే బావ్నే కెప్టెన్‌గా నియమించారు.
ఈ ఏడాది బుచ్చిబాబు టోర్నీ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 18 నుండి 20 వరకు గురునానక్ కళాశాల మైదానంలో ఛత్తీస్‌గఢ్‌తో తలపడనుంది.
మహారాష్ట్ర జట్టు
అంకిత్ బావ్నే (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ దాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్, సిద్ధార్థ్ మ్హత్రే, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), మందార్ భండారి, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ దాధే, ప్రదీప్ దద్దే, ప్రదీప్ దద్దే సోలంకి, రాజవర్ధన్ హంగర్గేకర్