పోరాడి ఓడిన భారత మహిళలు | Indian womens hockey team loses in World Cup | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన భారత మహిళలు

Aug 22 2026 4:02 AM | Updated on Aug 22 2026 4:02 AM

Indian womens hockey team loses in World Cup

అమ్‌స్టెల్వీన్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నీ రెండో దశను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. డిఫెండింగ్‌ చాంపియన్, ఆతిథ్య నెదర్లాండ్స్‌ జట్టుతో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో భారత జట్టు 0–2 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. గ్రూప్‌ ‘ఇ’లోనే ఆ్రస్టేలియా, చైనా మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగిసింది.  

భారత్‌పై గెలుపుతో నెదర్లాండ్స్‌ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం భారత్‌ (1 పాయింట్‌), చైనా (2 పాయింట్లు), ఆ్రస్టేలియా (1 పాయింట్‌) రేసులో ఉన్నాయి. ఆదివారం జరిగే రెండో దశ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌తో చైనా; ఆ్రస్టేలియాతో భారత్‌ తలపడతాయి. భారత్‌ సెమీఫైనల్‌ చేరాలంటే తప్పనిసరిగా ఆ్రస్టేలియాను ఓడించాలి. అంతేకాకుండా నెదర్లాండ్స్‌ చేతిలో చైనా ఓడిపోవాలి.   

నెదర్లాండ్స్‌తో నేడు భారత్‌ పోరు: పురుషుల హాకీ ప్రపంచకప్‌ రెండో దశలో భాగంగా నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ ఆడుతుంది. సెమీఫైనల్‌ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా విజయం సాధించాలి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement