ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కేట్ క్రాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 34 ఏళ్ల క్రాస్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని 'నో బాల్స్: ది క్రికెట్ పాడ్‌కాస్ట్'లో క్రాస్ వెల్లడించింది. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను ఆమె షేర్ చేసింది.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సమ్మర్ సీజనే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా తనకు చివరిదని కేట్ స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పడం ఎంతో కష్టంగా ఉందని రిటైర్మెంట్ నోట్‌లో క్రాస్ రాసుకొచ్చింది. ఇటీవల ముగిసిన 'ది హండ్రెడ్ 2026' టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టుకు ఆమె ప్రాతినిథ్యం వహించింది. సన్‌రైజర్స్ రన్నరప్‌గా నిలవడంలో ఆమెది కీలక పాత్ర. కాగా 13 ఏళ్లకే ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడిన కేట్.. 2013 ఇంగ్లండ్ జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేసింది.
కేట్ దాదాపు తన 13 ఏళ్ల కెరీర్‌లో ఇంగ్లండ్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించింది. 2014ను యాషెస్ టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో ఆమెది కీలక పాత్ర. రెండు ఇన్నింగ్స్‌ల్లో (3-35) మూడేసి వికెట్లు తీసిన ఆసీస్ ఓటమిని శాసించింది. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో 102 మ్యాచులు ఆడిన కేట్ 140 వికెట్లు తీసింది.
చదవండి: IND vs SL: భారత్‌తో రెండో టెస్టు.. శ్రీలంక జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు


