జో రూట్‌ ప్రపంచ రికార్డు | Joe Root scripts history, breaks Steve Smiths Test catching record | Sakshi
Sakshi News home page

ENG vs PAK: జో రూట్‌ ప్రపంచ రికార్డు

Aug 21 2026 9:14 PM | Updated on Aug 21 2026 9:19 PM

Joe Root scripts history, breaks Steve Smiths Test catching record

PC: X

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రూట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. లీడ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టు మూడో రోజు ఆటలో రూట్ ఈ చారిత్రక ఘనతను సాధించాడు. 

జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ అజాన్ అవాయిస్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో రూట్ ఈ రేర్ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ లెజెండరీ బ్యాటర్ ఇప్పటివరకు 219 టెస్టు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (218 క్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా క్యాచ్‌తో స్మిత్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.

టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లు

జో రూట్ (ఇంగ్లండ్‌)-219

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-218

రాహుల్ ద్రవిడ్ (భారత్)-210

మహేళ జయవర్ధనే (శ్రీలంక)-205

జాక్వెస్ కల్లిస్‌ (దక్షిణాఫ్రికా)- 200

పాక్ చిత్తు 
ఇక లీడ్స్ టెస్టులో పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్ 103 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది.  ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 171 ప‌రుగుల‌కు ఆలౌటైన పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అంత‌కంటే దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. 238 ప‌రుగుల వెన‌కంజ‌తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాక్ జ‌ట్టు.. ఇంగ్లండ్ బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 135 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 

ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్లు ఓలీ రాబిన్సన్‌, జోష్‌ టంగ్‌, జోఫ్రా ఆర్చర్‌ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్‌ పతనాన్ని శాసించారు. అంత‌కుముందు మూడో రోజు ఆట‌లో ఇంగ్లండ్ 409 ప‌రుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ జోరూట్‌(66), హ్యారీ బ్రూక్‌(91), లారెన్స్‌(51), కాక్స్‌(73) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఈ విజ‌యంతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన సన్‌రైజర్స్‌ స్టార్‌ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement