పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాక్‌ను ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. సల్మాన్ అఘా సారథ్యంలోని పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 171 పరుగులకే కుప్పకూలింది.
ఇంగ్లండ్ పేసర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ తలా ఐదేసి వికెట్లు పడగొట్టి పాక్ జట్టును దెబ్బ తీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (61), ఇమామ్-ఉల్-హక్ (42) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), లారెన్స్(51), కాక్స్(73) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ అలీ ఉస్మాన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 238 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పాక్ జట్టు.. కేవలం 135 పరుగులకే ఆలౌటైంది.
పేస్ బౌలర్లు ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించారు. ఈ విజయంతో ఇంగ్లండ్ మూడు టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు లండన్ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్ స్టార్ క్రికెటర్


