ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్‌ | Pakistan-Spinner Ali Usman-Break-Massive-Record-Fifer-Vs ENG-1st Test | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్‌

Aug 21 2026 11:21 AM | Updated on Aug 21 2026 12:05 PM

Pakistan-Spinner Ali Usman-Break-Massive-Record-Fifer-Vs ENG-1st Test

Photo Credit: Twitter

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ చరిత్రను తిరగరాశాడు. హెడ్డింగే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 33 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 23 ఓవర్లు వేసి 92 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్న అలీ ఉస్మాన్ ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి పాక్ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. 

గతంలో ఇంగ్లండ్ గడ్డపై పర్వేజ్ సాజద్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు పడగొట్టగా, ఇక్బాల్ ఖాసిమ్, షుజాహుద్దీన్‌లు చెరో మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు, ఫవద్ ఆలం ఒక ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఇంగ్లండ్ గడ్డపై తక్కువ ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్‌ బౌలర్‌గా అలీ ఉస్మాన్ బెస్ట్ ఫిగర్స్ కూడా నమోదు చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే ఇంగ్లండ్‌ ఇప్పటికైతే పైచేయిలోనే ఉంది. జో రూట్‌ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాట‌ర్లు హాఫ్‌ సెంచరీలతో చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్‌సన్, జోఫ్రా ఆర్చర్‌లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచ‌రీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. 

పాక్ బౌల‌ర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయ‌గా, మొహ‌మ్మ‌ద్ అబ్బాస్‌, ఖుర్ర‌మ్‌, మొహ‌మ్మ‌ద్ అలీ త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. అంత‌క‌ముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

 

చదవండి: 22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుద‌లైన భార‌త మాజీ క్రికెట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement