భారత క్రికెట్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ముత్తూట్‌ | Muthoot becomes title sponsor of Indian cricket | Sakshi
Sakshi News home page

భారత క్రికెట్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా ముత్తూట్‌

Sep 25 2026 4:15 AM | Updated on Sep 25 2026 4:15 AM

Muthoot becomes title sponsor of Indian cricket

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు స్పాన్సర్స్‌ జాబితాలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ చేరింది. వచ్చే రెండేళ్ల కాలానికి ముత్తూట్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు దక్కించుకుంది. ఈ ఒప్పంద కాలంలో భారత జట్టు 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టి20లతో కలిపి మొత్తం 35 మ్యాచ్‌లు ఆడనుంది. ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో ఈ ఒప్పందం ప్రారంభం కానుంది. 

2028 మార్చి 31 వరకు భారతదేశంలో జరిగే అన్నీ అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌లకు కొచ్చికి చెందిన ముత్తూట్‌ గ్రూప్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఒప్పందంలో భాగంగా ఒక్కో మ్యాచ్‌కు ముత్తూట్‌ సంస్థ రూ. 4 కోట్ల 85 లక్షలు చెల్లిస్తుంది. మొత్తం ఒప్పందం విలువ రూ. 169 కోట్ల 75 లక్షలు. గతంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ భారత క్రికెట్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించగా... ఒప్పందకాలం ముగియడంతో అంతకంటే 15 శాతం ఎక్కువ ధరపెట్టి ముత్తూట్‌ హక్కులు దక్కించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement