breaking news
Edge
-
అగాధం అంచున ప్రపంచం: జైశంకర్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రస్తుతం అగాధం అంచున ఉందని, ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ ప్రవేశం, సరఫరా గొలుసులు, సాంకేతికత సహా ప్రతిదీ ఆయుధంగా మారుతోందని హెచ్చరించారు. శాంతి, భద్రత, స్థిరత్వం కోసం దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో జరిగిన సాధారణ చర్చలో జైశంకర్ ప్రసంగించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత కూడా ప్రపంచంలో స్థిరత్వం, భద్రత, విశ్వసనీయత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక వనరులు, అనుసంధాన వ్యవస్థలు కూడా దేశాల ప్రయోజనాల కోసం ఒత్తిడి సాధనాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీంతో దేశాలు ప్రమాదాలను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వనరుల కొరతతో కూడిన నాలుగు రకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని జైశంకర్ తెలిపారు.ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం కావడం, ఎరువుల కొరత, ధాన్యం రవాణాలో అవరోధాలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయని జైశంకర్ చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై కూడా ఒత్తిడి పెరుగుతోందన్నారు. పాకిస్థాన్‌ను నేరుగా పేరుపెట్టకుండా జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహించే వారు వాస్తవాలను వక్రీకరించి, ఉగ్రవాదాన్ని సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తనను తాను రక్షించుకునే హక్కును వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. స్నేహం, సౌహార్దం, ఉగ్రవాదం ఒకేసారి కొనసాగలేవన్నారు. సరిహద్దులు దాటి జరిగే ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం ప్రపంచ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలు అని పేర్కొంటూ, దానికి పాల్పడే ప్రభుత్వాలను బాధ్యులను చేయాలని కోరారు.ఇదీ చదవండి: భారత్‌కు రష్యా మద్దతు.. భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం? -
హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆగస్టులో వైట్ కాలర్ ఉద్యోగుల నియామకాలు జోరుగా జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ఇందుకు ఆటో, హెల్త్‌కేర్, రిటైల్ తదితర రంగాలు దన్నుగా నిల్చాయి. ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరీడాట్‌కామ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గతేడాది ఆగస్టులో 2,664గా ఉండగా ఈ ఏడాది 3,028కి చేరింది. ఐటీయేతర, ఐటీ విభాగాలవ్యాప్తంగా, వివిధ స్థాయిల్లో అనుభవమున్న వారిని కంపెనీలు గణనీయంగా నియమించుకున్నాయి. అయితే, ఈ రిక్రూట్మెంట్స్ని పండగ సీజన్ కోణంలో చూడాల్సి ఉంటుందని ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) ఎండీ, సీఈవో హితేష్ ఓబెరాయ్ తెలిపారు. తదుపరి హైరింగ్ ధోరణులపై స్పష్టత రావచ్చని ఆయన పేర్కొన్నారు. నౌకరీడాట్‌కామ్ సైట్లో ప్రతి నెలా వచ్చే కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్, రిక్రూటర్లు చేసే సెర్చ్‌ల ఆధారంగా భారత్‌లో జాబ్ మార్కెట్, నియామకాల ధోరణులను ఈ సూచీ ట్రాక్ చేస్తుంది. ఆఫీసు ఉద్యోగాలను వైట్–కాలర్ జాబ్స్‌గా వ్యవహరిస్తారు. రిపోర్ట్ ప్రకారం.. ⇒ ఆగస్టులో ఆటో రంగంలో అత్యధికంగా 19 శాతం హైరింగ్ వృద్ధి నమోదైంది. ఈ బాటలో హెల్త్‌కేర్ 16%, రిటైల్ 15%, ఇన్సూరెన్స్ 12%, ఐటీ 11%, బ్యాంకింగ్ 10%, ఎఫ్ఎంసీజీ 10%, బీపీవో/ఐటీఈఎస్, ఆయిల్..గ్యాస్, రియల్ ఎస్టేట్ 8% చొప్పున వృద్ధి చెందాయి. ఫార్మా/బయోటెక్‌లో రిక్రూట్మెంట్ ఫ్లాట్‌గా ఉండగా, ఆతిథ్యం..ట్రావెల్ రంగాల్లో హైరింగ్ 4 శాతం, విద్యా రంగంలో 8 శాతం తగ్గింది. ⇒ ఎక్స్పీరియన్స్పరంగా చూస్తే ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ 15 శాతం, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్ 10 శాతం పెరిగింది. 8–12 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్ 16 శాతం, 13–16 ఏళ్ల ఎక్స్పీరియన్స్ (18 శాతం), 16 ఏళ్లు పైగా ఉంటే 13 శాతం మేర రిక్రూట్మెంట్ పెరిగింది. ⇒ మెట్రో నగరాలలో 23 శాతం హైరింగ్‌తో హైద రాబాద్ అగ్రస్థానంలో నిల్చింది. కోల్‌కతా (22 శాతం), చెన్నై (20 శాతం) ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. -
హైదరాబాద్‌లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్‌లో భాగమైన క్యారకల్‌తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్‌లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్‌పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు. -
మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్ వేరియంట్ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లకు కాస్త అటూఇటుగా ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్ మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టేరేజ్ 50 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, త్వరలో ఆండ్రాయిడ్ 14 స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి. -
వైరల్ వీడియో : నాలుగో అంతస్తులో నిలబడి కిటికీ అద్దాలు శుభ్రం చేస్తూ..!
-
వామ్మో.. చూస్తుండగానే 60 అడుగుల కొండపై నుంచి..
లండన్: మనలో చాలా మంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి కొండలపైకి, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ తమ వారితో సరదాగా గడిపి ఒత్తిడిని దూరం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొసారి ఈ విహారయాత్రలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీంతో, ఆ విహార యాత్ర కాస్త, విషాద యాత్ర గా మారిపోతుంది. అయితే, యూకేలోజరిగిన ఒక విషాదయాత్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్న్‌వాల్ లోని లామోర్నా కోవ్ పట్టణంలో రెబెకా క్రాఫోర్డ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉండేది. ఆమె గతేడాది తన సోదరి రెబెకా డెబ్స్తో కలిసి స్థానికంగా ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. అక్కడ సరదాగా గడపాలను కున్నారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటూ కొండ అంచుల వద్ద చేరుకున్నారు. అక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారు మాటల్లో పడి కొండ అంచున ఉన్న విషయం కూడా మరిచిపోయారు. అప్పుడు, రెబెకా క్రాఫోర్డ్ కొండపై నుంచి చూస్తుండగానే కాలుజారి కింద పడింది. దీంతో, రెబెకా డెబ్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యింది. తన సోదరి కొండపై నుంచి కింద పడటాన్ని చూసింది. ఆమె నోటినుంచి మాట రాలేదు. తన అక్క అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే తేరుకుని యూకేలోని డయల్ అంబూలెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ ప్రాంతం కొండపైన ఉండటంతో కాసేపటికి ఎయిర్ అంబూలెన్స్ సర్వీస్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే యూకేలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయితే, రెబెకా ప్రస్తుతం కోలుకుంటుదని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా రెబెకా క్రాఫోర్డ్.. మెట్రో.కో.యూకే తో జరిగిన ఇంటర్వ్యూలో ఆ విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆ భయంకర సంఘటన నా జీవితంలో మరిచిపోలేను’.. నేను నా సోదరితో కలిసి ఎత్తైన కొండపై ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడ్డాను. నా సోదరి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందకు పడిపోయేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు. నేను బండలపై పడ్డాను. ఆ తర్వాత, నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రెబెకా డెబ్స్ మాట్లాడుతూ.. ఇలాంటివి బహుశా సినిమాల్లో చూసుంటారు. 60 అడుగుల ఎత్తైన కొండపైనుంచి పడి బతకడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు మా సోదరికి పెద్ద గాయాలేవి కాలేవు. ఏలాంటి, రక్త స్రావం జరుగలేదు. కానీ, ముఖం దగ్గర మాత్రం కుట్లు పడ్డాయని తెలిపింది. నడుము దగ్గర చిన్నగా ఫాక్చర్ అయ్యిందని వివరించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. తమ సోదరిని సమయానికి ఆసుపత్రికి చేర్చిన ఎయిర్ అంబూలెన్స్ సిబ్బందికి రెబెకా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. -
నాలాపై ఇరుక్కుపోయిన కారు...
హన్మకొండ: అదుపు తప్పిన కారు..నాలా పైకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు పక్కనే గల నాలాలోకి దూసుకెళ్లిన కారు.. నాలా అంచుల మధ్య ఇరుక్కుంది. అదృష్టవశాత్తూ.. కారు నాలాలోకి పడిపోకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులోకి జారుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
ఆధార్‌కు ఆందోళన
పెదబయలులో రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ పెదబయలు : మండలంలో ఆధార్ మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ లబ్ధిదారులు శనివారం పెదబయలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. పెదబయలు మండలంలో ఐదు చోట్ల మోబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మండల తహాశీల్దార్ చొరవ చూపాలని నినాదాలు చేశారు. పెదబయలు మండలంలోని 23 గ్రామ పంచాయితీలలో ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని వీరు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో రోజుకు 50 మందిని కూడా నమోదు చేయడం లేదని చెప్పారు. దీనివల్ల 23 పంచాయతీల నుంచి వేలాది మంది వచ్చి మండల కేంద్రంలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజులు నిరీక్షిస్తున్నా ఆధార్ నమోదు కావడం లేదని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చి అవ స్థలు పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పారు. తహశీల్దార్ జాడేలేదన్నారు. ఈ నెల చివరి కల్లా అధార్ నమోదు పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదని, దీని వల్ల తాము ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాద ం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆధార్ మండలానికి ఎక్కువ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలతో పోలిస్తే పెదబయలు మండలంలోనే ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, టీడీపీ నాయకులు సీకరి సన్యాసిదొర, వెచ్చంగి కొండయ్య తదితరులు, సీకరి సర్పంచ్ వనల్భ సన్యాసి, గుల్లేలు సర్పంచ్ నాగరాజు, వివిధ గ్రామాల ఆధార్ అబ్ధిదారులు పాల్గొన్నారు.


