ఫండే
వింతలు విశేషాలు
ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక.. కానీ ఇక్కడ ఒక్క సమాధి కూడా నిజమైనది కాదు! చూస్తే అచ్చం నిజమైనదిలా కనిపించే ఈ ప్రదేశంలో ఏకంగా 5 వేల కృత్రిమ సమాధులు ఉన్నాయి. ఇంత భారీ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ శ్మశాన వాటిక. ఇందులో కనిపించేవన్నీ కృత్రిమ సమాధులే! పనికట్టుకుని మరీ ఈ కృత్రిమ శ్మశానాన్ని ఎందుకు నిర్మించారని అనుకుంటున్నారా? దీనిని 1966 నాటి సూపర్ డూపర్ హిట్ హాలీవుడ్ సినిమా ‘ది గుడ్, ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’ కోసం శ్మశాన వాటికలో చిత్రించాల్సిన సన్నివేశాల కోసం దీనిని ప్రత్యేకంగా నిర్మించారు.
స్పెయిన్ ఉత్తర ప్రాంతంలోని మిరాండిలా లోయలో పదిహేడున్నర ఎకరాల స్థలంలో ‘సేడ్‌హిల్ సెమట్రీ’ పేరుతో ఈ కృత్రిమ శ్మశానం సెట్‌ను నిర్మించారు. ఇది అత్యంత సహజంగా కనిపించడానికి ఇందులో ఏకంగా ఐదువేల కృత్రిమ సమాధులను, నలభై మీటర్ల వ్యాసంలో ఒక భారీ వధ్యశిలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సెట్‌ను అలాగే ఉంచేశారు. ఇది ఇప్పటికీ నిలిచి ఉంది. స్పెయిన్ పర్యటనకు వచ్చే హాలీవుడ్ అభిమానులు తప్పనిసరిగా దీనిని చూసి పోతుంటారు. వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న ఈ కృత్రిమ శ్మశాన వాటికకు 2015లో ‘సేడ్‌హిల్ కల్చరల్ అసోసియేషన్’ వాలంటీర్లు మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికీ వారు ఈ శ్మశాన వాటికను ఒక చారిత్రక ప్రదేశంలా కాపాడుతూ వస్తుండటం విశేషం.
ఇదీ చదవండి: కొబ్బరి.. కాయా? పండా..? కోర్టు మెట్లు ఎక్కించిన ప్రశ్న!


