కొత్త అనుభూతినిచ్చేలా... | Naga Chaitanya reveals major update on Vrushakarma | Sakshi
Sakshi News home page

కొత్త అనుభూతినిచ్చేలా...

May 17 2026 12:02 AM | Updated on May 17 2026 12:02 AM

Naga Chaitanya reveals major update on Vrushakarma

నాగచైతన్య హీరోగా కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వృష కర్మ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్‌ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బి. సుకుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రాజస్తాన్‌లో ఓ భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశారు.

దీంతో ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపి, రాజస్తాన్‌ లొకేషన్‌లోని కొన్ని ఫొటోలను విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్ప కళతో కనిపిస్తున్న ఈ లొకేషన్స్‌లో చిత్రీకరించిన కీలక సన్నివేశాలు సినిమాకి ఓ హైలైట్‌ అని తెలుస్తోంది. ‘‘షూటింగ్‌ ముగింపు దశకు చేరుకోవడంతో పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుపుతున్నాం. అత్యాధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి కృషి చేస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement