breaking news
katya
-
చీరదరహాసం
స్పోర్ట్స్, ఎడ్వెంచర్ యాక్టివిటీలకు చీర ‘అన్‌ఫిట్’ అనే భావన ఉంది. అయితే క్రమంగా ఈ భావనలో మార్పు వస్తోంది. ‘శారీతో కూడా ఓకే’ అనిపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ కాత్య సైనీ చీర ధరించి కైట్ సర్ఫింగ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘నౌ దిస్ ఈజ్ క్రాస్ కల్చర్. ఐ లవ్ దిస్’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘చీర ధరించి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే’ అని కొందరు హెచ్చరించారు. గత ఫిబ్రవరిలో షైను అనే యూజర్ పోస్ట్ చేసిన ఇలాంటి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక నడి వయసు స్త్రీ చీర ధరించి రోప్ సైకిలింగ్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. వైరల్ -
కలిసి బతకలేమని పారిపోయి..
ఒకరినొకరు ఇష్టపడి కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఓ యువజంట తల్లిదండ్రులు అందుకు అంగీకరించరని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ యువజంట ఆత్మహత్య వాయువ్య రష్యాలో కలకలం రేపింది. పీఎస్కోవ్ ప్రాంతానికి చెందిన డెనిస్ మురావ్యోవ్(15), కత్యా(15)లు మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. అంతకుముందు కత్యాను తీసుకుని వెళ్లడం కోసం ఆమె ఇంటికి వెళ్లిన డెనిస్.. కత్యాను ఆమె తల్లి మందలిస్తుండటంతో ఆమెపై కాల్పులు జరిపాడు. కాగా ఈ కాల్పుల్లో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. అక్కడి నుంచి పారిపోయిన యువజంట క్రస్నియే స్ట్రుగీ అనే గ్రామంలోని కత్యా అంకుల్ ఇంటికి చేరింది. మహిళపై కాల్పులు జరిపి పారిపోయిన యువజంటను పట్టుకునేందుకు రష్యా జాతీయ దళాలు రంగంలోకి దిగి వెతుకులాట ప్రారంభించాయి. ఈ విషయం తెలుసుకున్న యువజంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాము ఒకరిని విడిచి మరొకరం బతకలేమని ఆత్మహత్య చేసుకోబోయే కొద్ది గంటల ముందు సోషల్ మీడియాలో రాసుకుంది. ఇంట్లో పెద్ద ఎత్తున బుల్లెట్లు, అందుబాటులో ఉన్న ఆయుధాలను సిద్ధం చేసుకున్న జంట తాము పోలీసులకు లొంగిపోతే ఒకరినొకరు ఎప్పటికీ కలుసుకోలేమని, అదే లొంగిపోకపోతే చనిపోతామని.. ఎడబాటు కన్నా చనిపోవడమే ఉత్తమని పేర్కొన్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసు వాహనంపై డెనిస్ పలుమార్లు కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను డెనిస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. కొద్ది గంటల పాటు యువజంటను ప్రాణాలతో పట్టుకునేందుకు ప్రయత్నించిన భద్రతా దళాలు వారు మాట వినపోతుండటంతో ఇంటిపై గ్రేనేడ్లు విసిరి లోపలికి ప్రవేశించాయి. దీంతో ఆ యువజంట తమని తాము కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది. కాగా ఘటన పూర్తి స్ధాయిలో విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.