breaking news
Love And War Movie
-
'96' జంట లవ్ అండ్ వార్
విజయ్ సేతుపతి, త్రిష నటించిన సూపర్ హిట్ సినిమా '96'లో బాలనటులుగా మెప్పించిన గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్ ప్రస్తుతం హీరోహీరోయిన్ అయిపోయారు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న కొత్త చిత్రానికి 'లవ్ అండ్ వార్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.రాజ్ కుమార్ రంగస్వామి దర్శకుడుగా పరిచయం అవుతుండగా.. కన్నన్ భాస్కర్ నిర్మిస్తున్నారు. హనీమూన్ వెళ్లిన యువ జంట.. చిన్న సమస్యను పరస్పరం చర్చించుకుని పరిస్కరించుకోవాల్సింది పోయి ఈగో కారణంగా మరింత పెద్దదిగా చేసుకుంటారు. చివరకు మరి ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీస్తున్నారు. అనుబంధాలను కోల్పోకూడదు అని ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర షూటింగ్ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతామని వెల్లడించారు. -
షూటింగ్ ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్.. చివరికి వాయిదా!
ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు ప్రకటన రోజే రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తున్నాయి. తీరా షూటింగ్ అయ్యేసరికి విడుదలను వాయిదా వేస్తున్నారు. తాజాగా అలా వాయిదా పడిన చిత్రమే ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్‌లో నటించనున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించి, 2025 క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. (చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఆలియా భట్‌తో సినిమా!)ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. కానీ ‘లవ్ అండ్ వార్’ రిలీజ్‌ను మాత్రం వాయిదా వేశారు. 2026 మార్చి 20న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదో పీరియాడికల్ ఫిల్మ్ అని, ముక్కోణపు ప్రేమకథగా ఉంటుందని సమాచారం. అలాగే వివాహం తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించనున్న చిత్రం కావడంతో ‘లవ్ అండ్ వార్’ పై అంచనాలు ఉన్నాయి.


