'96' జంట లవ్ అండ్ వార్ | Gouri Kishan Love And War Movie Update | Sakshi
Sakshi News home page

'96' జంట లవ్ అండ్ వార్

Jul 1 2026 11:44 AM | Updated on Jul 1 2026 11:53 AM

Gouri Kishan Love And War Movie Update

విజయ్ సేతుపతి, త్రిష నటించిన సూపర్ హిట్ సినిమా '96'లో బాలనటులుగా మెప్పించిన గౌరీ కిషన్, ఆదిత్య భాస్కర్ ప్రస్తుతం హీరోహీరోయిన్ ‍అయిపోయారు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న కొత్త చిత్రానికి 'లవ్ అండ్ వార్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

రాజ్‌ కుమార్‌ రంగస్వామి దర్శకుడుగా పరిచయం అవుతుండగా.. కన్నన్‌ భాస్కర్‌ నిర్మిస్తున్నారు. హనీమూన్‌ వెళ్లిన యువ జంట.. చిన్న సమస్యను పరస్పరం చర్చించుకుని పరిస్కరించుకోవాల్సింది పోయి ఈగో కారణంగా మరింత పెద్దదిగా చేసుకుంటారు. చివరకు మరి ఒక్కటయ్యారా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తీస్తున్నారు. అనుబంధాలను కోల్పోకూడదు అని ఇందులో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రిలీజ్ డేట్ త్వరలోనే చెబుతామని వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement