breaking news
Gouri Kishan
-
నటికి అభ్యంతరకర ప్రశ్న.. తప్పులో కాలేసిన ఖుష్బూ!
మలయాళ నటి గౌరీకిషన్ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్ కాదని జర్నలిస్ట్ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.హీరోను అడగ్గలరా?ఈ వ్యవహారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది. మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్, ఆమె గౌరీ శంకర్ కాదు.. గౌరీ కిషన్ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Dhanya Rajendran (@dhanyarajendran) Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…— KhushbuSundar (@khushsundar) November 7, 2025చదవండి: ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి -
ప్రెస్మీట్లో ఇదేం ప్రశ్న.. ఫైర్ అయిన నటి
తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్ అయింది. దీంతో ఆమెకు నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్ ఫుల్ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్ పెంచాడు. నా బరువుతో మీకేంటి అవసరందీంతో గౌరీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్‌గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్ అయింది. ఆ జర్నలిస్ట్ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గౌరీ కిషన్ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చానని తెలిపింది. కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.96 సినిమా త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.நடிகையிடம் அநாகரிக கேள்வி எழுப்பிய யூடியூபர்.. தனி ஆளாக தரமான பதிலடி கொடுத்த நடிகை கௌரி கிஷன்....!#Polimer | #Chennai | #Actress | #Movie | #GouriGKishan pic.twitter.com/4qkQqGVYyw— Polimer News (@polimernews) November 6, 2025 -
నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్
సమాజంలో, ముఖ్యంగా సినీ సమాజంలో నటీ మణులు, హీరోయిన్లపై, శరీరాలపై అవమానకర (Bodyshaming) వ్యాఖ్యలు పరిపాటిగా మారిపోయాయి. తాజాగా తమిళ నటి గౌరీ కిషన్ (Gouri Kishan) శరీరాన్ని అవమానించేలా ఒక ప్రెస్మీట్లో అడిగిన ప్రశ్న ఆగ్రహ జ్వాలల్ని రగిలించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా చెన్నైలో జరిగిన ప్రెస్ ఈవెంట్లో తన బరువు గురించి తమిళ యూట్యూబ్ మీడియా జర్నలిస్టు ‘మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు?’ అని అడిగిన ప్రశ్నకు గౌరీ కిషన్ తీవ్రంగా స్పందించింది. నటిగా నా నటన గురించి అడిగాలి, సినిమా గురించి అడగాలి కానీ, నా శరీర బరువు గురించి అడగడం ఏమిటంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ప్రశ్న ఒక పురుష నటుడి బరువు గురించి అడుగుతారా అని కూడా ఆమె ప్రశ్నించింది. పైగా బరువు గురించి అడిగిన ప్రశ్న కరెక్టే అని ఒక పురుష జర్నలిస్ట్ వాదించడం దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, ఇది జర్నలిజం కాదు. వేధింపులతో సమానమని పేర్కొంది. జర్నలిస్టులు వృత్తికి అవమానం తెస్తున్నారంటూ సీరియస్ అయ్యింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద నటికి మద్దతుగా నిలిచారు. మహిళలపై ఆబ్జెక్టిఫికేషన్, బాడీ షేమింగ్‌కు అడ్డుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు. గౌరీ కిషన్ తన రాబోయే చిత్రం 'అదర్స్' కోసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగికత గురించి చర్చకు దారితీసింది. గౌరీ స్పందనతో అక్కడే వున్న ఆదిత్య మాధవన్ మౌనం కూడా ఈ చర్చకు ఆజ్యం పోసింది.క్షమాపణలు కోరిన హీరోఅయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరీ సహనటుడు, నటుడు ఆదిత్య మాధవన్ దీనిపై స్పందిస్తూ అందరికీ క్షమాపణలు చెప్పారు. తన మౌనం బాడీ షేమ్ చేయడాన్ని ఆమోదించినట్టుకాదనీ, కానీ ఆ సందర్భంలో స్తంభించి పోవడంతో తన నోట మాట రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అయినా తాను జోక్యం చేసుకుని ఉండి ఉంటే బాగుండు అన్నారు.చిన్మయి స్పందనగాయని చిన్మయి శ్రీపాద ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు."గౌరీ అద్భుతమైన పని చేసింది. అగౌరవకరమైన, అనవసరమైన ప్రశ్న అడిగిన క్షణం, అరుపులు, ఎదురుదెబ్బలు వినిపిస్తాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత ధైర్యంగా నిలబడినందుకు చాలా గర్వంగా ఉంది. ఏ పురుష నటుడిని కూడా బరువు గురించి అడగరు అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.అటు పలువురు మహిళా జర్నలిస్టులు, పలువురు నెటిజన్లు గౌరీ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. హీరో, దర్శకుడు అక్కడే ఉండి కూడా మౌనంగా ఉండటం ఇద్దరికీ సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌరీ కిషన్ తనదైన నటన, ప్రతిభతో హీరోయిన్గా రాణిస్తోంది తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.Thank you @Chinmayi Women like you inspire us to stand our ground. Your support means a lot to me, thank you. https://t.co/SbfN3eCyEp— Gouri G Kishan (@Gourayy) November 6, 2025


