తమిళ సినిమా '96'తో తెలుగువారికి పరిచయమైన గౌరీ కిషన్(Gouri Kishan )కు మీడియా సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా అదర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ యూనిట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే, ఈ సమావేశంలో తన బరువు గురించి అవమానకరమైన ప్రశ్న అడిగినందుకు రిపోర్టర్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆపై తన ప్రశ్నను అతను సమర్థించుకునేందుకు ప్రయత్నం చేయడంతో గౌరీ కూడా ఫైర్ అయింది. దీంతో ఆమెకు నెటిజన్లు మద్ధతుగా నిలిచారు.
తమిళ, మలయాళ చిత్రాలతో గౌరీ కిషన్ ఫుల్ బిజీగా ఉంది. అబిన్ హరికరణ్ దర్శకత్వంలో తను నటిస్తున్న కొత్త చిత్రం ‘అదర్స్’ త్వరలో విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో ఒక జర్నలిస్ట్ ‘మీ బరువు ఎంత ఉంటుంది..?’ అని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేందుకు గౌరీ అసహనం వ్యక్తం చేయడంతో ఆ జర్నలిస్ట్ కూడా తన ప్రశ్నను సమర్థించుకుంటూ మరోసారి అడిగాడు. ఈ ప్రశ్నకు గతంలో కొందరు స్టార్ హీరోయిన్లు కూడా సమాధానం చెప్పారని వాయిస్ పెంచాడు.

నా బరువుతో మీకేంటి అవసరం
దీంతో గౌరీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 'నా బరువు గురించి నాతో చర్చించే హక్కు దర్శకుడికి ఉంది. కానీ, ఒక జర్నలిస్ట్‌గా మీకేంటి అవసరం..? స్త్రీ శరీరం చాలా సంక్లిష్టమైనది, హార్మోన్ల అసమతుల్యతతో ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండానే, నా బరువు గురించి అడగడానికి మీరు ఎవరు.. నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు..? నా బరువు వల్ల సినిమాకు ఏమైనా నష్టం జరిగిందా..? ఇప్పటికి నేను చాలా సినిమాలు చేశాను. నా ప్రతిభ గురించి అడగండి. కనీసం ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల గురించి అడగరెందుకు..' అని ఆమె ఫైర్ అయింది. ఆ జర్నలిస్ట్ కూడా తన తప్పును తెలుసుకుని ఆమెకు వెంటనే క్షమాపణ చెప్పాడు. ఆమెను బాడీ షేమింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.
జర్నలిస్టుల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని గౌరీ కిషన్ చెప్పింది. తాను కూడా జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చానని తెలిపింది. కానీ, ఇలాంటి ప్రశ్నలు జర్నలిస్టిక్ నీతిని పాటించవని స్పష్టం చేసింది. ప్రెస్ మీట్ సందర్భంగా తనను ఇలా ఇబ్బంది పెట్టడం బాధ అనిపించినప్పటికీ వారి పట్ల తనకు ఎటువంటి ద్వేషం లేదని ఆమె స్పష్టం చేసింది.
96 సినిమా త్రిష చిన్నప్పటి పాత్రలో గౌరీ కిషన్ నటించింది. ఇదే మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలైంది. ఆమె ఇందులో కూడా నటించిది. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది.
நடிகையிடம் அநாகரிக கேள்வி எழுப்பிய யூடியூபர்.. தனி ஆளாக தரமான பதிலடி கொடுத்த நடிகை கௌரி கிஷன்....!#Polimer | #Chennai | #Actress | #Movie | #GouriGKishan pic.twitter.com/4qkQqGVYyw
— Polimer News (@polimernews) November 6, 2025


