మలయాళ నటి గౌరీకిషన్ (Gouri G Kishan)కు చేదు అనుభవం ఎదురైంది. తను హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ అదర్స్. ఈ తమిళ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెను ఓ జర్నలిస్టు అవమానకరమైన ప్రశ్నతో ఇబ్బందిపెట్టాడు. మీ బరువెంత? అని అడిగాడు. అది విని షాకైన గౌరీ కిషన్.. నా బరువుతో మీకేం అవసరం? ఇది చాలా చెత్త ప్రశ్న.. ఇలా అడగడం బాడీ షేమింగే అవుతుంది అని మండిపడింది. అది బాడీ షేమింగ్ కాదని జర్నలిస్ట్ వాదించాడు. అలా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది.
హీరోను అడగ్గలరా?
ఈ వ్యవహారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ఘాటుగా స్పందించింది. జర్నలిజం విలువలు కోల్పోతోంది. కొందరు జర్నలిజాన్ని తప్పుగా వాడుతున్నారు. ఒకమ్మాయి బరువు గురించి వారికెందుకు? హీరోయిన్‌ను సూటిగా అడిగినప్పుడు మరి హీరో బరువు గురించి ఎందుకు అడగలేదు? ఇది నిజంగా సిగ్గుచేటు. యువ నటి గౌరీని ఈ విషయంలో అభినందించాల్సిందే! అభ్యంతరకర ప్రశ్న అడిగిన వ్యక్తికి అక్కడే ఇచ్చిపడేసింది.
మీ ఇంట్లోవాళ్లను అడిగితే ఓకేనా?
మేము ఎదురుతిరిగి మీ కుటుంబంలోని స్త్రీల గురించి అలాంటి చెత్త ప్రశ్నలు అడిగితే మీకు ఓకేనా? ముందు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి.. గౌరవం ఇచ్చిపుచ్చుకోండి అని ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ ఓ చిన్న పొరపాటు చేసింది. నటి గౌరీకిషన్ పేరుకు బదులుగా గౌరీ శంకర్ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు, మేడమ్, ఆమె గౌరీ శంకర్ కాదు.. గౌరీ కిషన్ అని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Journalism has lost its ground. The so called journos take journalism to the gutters. How much a woman weighs is none of their business. And asking the hero about it?? What a shame! Kudos to the young #GowriShankar who stood her ground and gave it back. Are the same men ok if…
— KhushbuSundar (@khushsundar) November 7, 2025


