‘రామాయణ’ డేట్‌ ఫిక్స్‌ | Ranbir Kapoor's Ramayana English Trailer Out: Part 1 Release On November 6 | Sakshi
Sakshi News home page

‘రామాయణ’ డేట్‌ ఫిక్స్‌

Aug 7 2026 1:24 AM | Updated on Aug 7 2026 11:48 AM

English trailer Release for Ranbir Kapoor Ramayana

రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్‌ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్‌ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు.

ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేశారు. తాజాగా ఇంగ్లిష్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, ‘రామాయణ పార్ట్‌ 1’ను నవంబరు 6న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్‌. ‘రామాయణ’ ఇంగ్లిష్‌ ట్రైలర్‌లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్‌ సింక్‌కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్‌ వినిపిస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్‌ రిలీజ్‌ చేస్తుండగా, ఓవర్‌సీస్‌లో సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ రిలీజ్‌ చేయనుంది. నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్‌ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్‌ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement