తాడేపల్లి : ఆసియాకప్ సాధించిన భారత అండర్-19 క్రికెట్ జట్టుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఎక్కడా పట్టువీడకుండా చివరి వరకూ పోరాడి భారత జట్టు విజయం సొంతం చేసుకోవడం నిజంగా చిరస్మరణీయమన‍్నారు.
‘338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. కీలక దశల్లో వికెట్లు కోల్పోయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన యువ క్రికెటర్లు పోరాడారు. జట్టు విజయానికి మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చేసిన కృషి అభినందనీయం.
యువ ఆటగాళ్ల ప్రతిభ, ధైర్యం, పట్టుదలకు ఈ విజయం నిదర్శనం. విజయం కోసం చివరి వరకు పోరాడిన ప్రతి ఒక్క ఆటగాడికి అభినందనలు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు.
Heartiest congratulations to the Indian Under-19 cricket team on winning the Asia Cup and making the nation proud. In a thrilling final against Pakistan, India chased 338. Despite losing wickets at crucial stages, our young cricketers stayed composed and fought to the end. Manal Chauhan and Mohit Ulva made vital late contributions to secure a one-wicket victory. This win reflects the team’s talent, courage and determination. I congratulate the players and wish our young champions continued success and many more triumphs. #MensU19AsiaCup
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2026
ఇదీ చదవండి: ఉత్కంఠపోరు.. పాకిస్తాన్‌పై టీమిండియా సంచలన విజయం


