‘పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ స్థానానికి పోటీలో ఉండాలి’ | Sajjala teleconference with YSRCP cadres Panchayat elections | Sakshi
Sakshi News home page

‘పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ స్థానానికి పోటీలో ఉండాలి’

Nov 14 2026 6:28 PM | Updated on Nov 14 2026 6:36 PM

Sajjala teleconference with YSRCP cadres Panchayat elections

తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ స్థానానికి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు పోటీలో ఉండాలని పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్క సర్పంచ్‌, వార్డు స్థానాలను పోటీ లేకుండా వదలొద్దని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఈరోజు(శనివారం, నవంబర్‌ 14వ తేదీ) పార్టీ ముఖ్య నేతలతో సజ్జల టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. 

దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ స్థానానికి పోటీ చేయాలి. ఏ ఒక్క సర్పంచ్‌, వార్డు స్థానాలను పోటీ లేకుండా వదలొద్దు. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు తప్పనిసరిగా బరిలో ఉండాలి. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి స్థానంలో గట్టి పోటీ ఇవ్వాలి. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పని చేయాలి. 

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి. అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. నామినేషన్ల అడ్డగింతలు, పోలీసుల దౌర్జన్యాలపై వీడియో ఆధారాలు సేకరించాలి. ఎన్నికల అక్రమాలపై తక్షణమే ఫిర్యాదులు చేయాలి. అవసరమైతే  న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో  పార్టీ పరిశీలకులు క్రియాశీలకంగా వ్యవహరించాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

ఇదీ చదవండి: ఏపీ డీజీపీ​​కి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement