
హిమాచల్ ప్రదేశ్‌లో ఓ నర్స్ సాహసం..
మండి: తండాల్లో ఉన్న గిరిజనులకు వైద్యం అందించడానికి కొండ, కోనల్లో కిలోమీటర్లు నడిచిన నర్సులను తెలుగు రాష్ట్రాల్లో చూశాం. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఈ నర్సు... విధి నిర్వహణకోసం ఉప్పొంగి ప్రవహిస్తున్న నదిని సైతం లెక్క చేయడం లేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను చేరుకోవడానికి గర్జిస్తూ ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్తున్నారు. మండి జిల్లాకు చెందిన నర్సు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జిల్లాలోని టిక్కర్ గ్రామానికి చెందిన కమల పక్కనే ఉన్న గ్రామంలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె విధులకు హాజరు కావడానికి ప్రతిరోజూ దాదాపు నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. అయితే ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆమె రోజువారీ ప్రయాణం కష్టంగా మారింది. నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆమె నదిలోని రాళ్లను దాటుతూ వెళ్తున్నారు.
ఈక్రమంలో ఒక్క అడుగు తప్పుగా వేసినా.. నదిలో కొట్టుకు పోవాల్సిందే. అయినా.. ఏమాత్రం వెరవకుండా వెళ్తుండటం చూసేవాళ్లకు వణుకు పుట్టిస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా వారాల్లో చౌహార్ లోయ విస్తృతంగా నష్టపోయింది. వంతెనలు, రోడ్లు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్ అంతటా 313 రోడ్లు వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. వాటిలో 160 మండి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో సిల్బుధాని, తర్సా్వన్ వంటి పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. కమల వంటి అనేక మంది ఉద్యోగులు, కారి్మకులు, స్థానికులు తమ రోజువారీ కార్యకలాపాలకోసం ఇలాంటి కాలువలు, వాగుల మీద ప్రమాదకర క్రాసింగ్‌లపై ఆధారపడుతున్నారు.