సాక్షి, చెన్నై: డ్రైవర్ రహిత మెట్రో రైలు చెన్నైలో పట్టాలెక్కింది. వడపళణి నుంచి పోరూర్ వరకు తొలిరోజు ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతం చేశారు. మరో వారం రోజులపాటు ఈ ట్రయల్ రన్‌ను నిర్వహిస్తారు. పూందమల్లి నుంచి వడపళని వరకు మెట్రో డబుల్ డెక్కర్ వంతెన రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో పూందమల్లి నుంచి పోరూర్ వరకు ఇప్పటికే తొమ్మిది కి.మీ మేర పనులు పూర్తిచేశారు.
దీంతో.. మరికొద్ది రోజుల్లో డ్రైవర్ రహిత మెట్రో సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో పోరూర్ నుంచి వడపళణి వరకు డబుల్ డెక్కర్ వంతెన పనులు కూడా ఐదు కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. ట్రాక్ ఏర్పాటు, సిగ్నలింగ్ తదితర పనులన్నీ ముగించారు. అధికారులు శని, ఆదివారాల్లో విస్తృతంగా పరిశీలించారు. డ్రైవర్ రహిత మెట్రో రైలును పోరూర్ నుంచి వడపళని వరకు, వడపళణి నుంచి పోరూర్ వరకు పట్టాలెక్కించారు.


