షిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో ఆనాటి కియోంథల్ సంస్థానాధీశులు నిర్మించిన 200 ఏళ్లనాటి అందమైన జుంగా ప్యాలెస్ బుధవారం బుగ్గి పాలైంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్యాలెస్‌లో మంటలు చెలరే గాయి. వెనువెంటనే అగ్నికీలలు ప్యాలెస్ మొ త్తాన్నీ ఆక్రమించాయి. షిమ్లా నగరానికి 26 కిలోమీటర్ల దూరంలోని జుంగా ప్రాంతంలో ఈ జుంగా మహల్ ప్యాలెస్ ఉంది.
అగ్నిప్రమా దంలో మహల్‌లోని చారిత్రక పత్రాలు, పురాతన ఫర్నీచర్, అత్యంత రమణీయమైన కళాఖండాలు, చిత్రాలు, అబ్బురపరిచే నిర్మాణ కౌశలంతో ఉట్టిపడే భవనంలోని దర్వాజాలు, కిటికీలు, షాండ్లియర్లు అన్నీ కాలిపోయాయి. హిమాచల్ ప్రదేశ వారసత్వ సందపగా ఈ మహల్‌కు ఎంతో పేరుంది. ఏటా ఈ మహల్‌ను సందర్శించే దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య సైతం చాలా ఎక్కువ. అగ్ని ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.


