
బిలాస్‌పూర్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
బల్లూ బ్రిడ్జ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ముగ్గురిని సురక్షితంగా బయటికి తీసినట్లు బిలాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉందని అధికారులు పేర్కొన్నారు. బస్సు.. హర్యానాలోని రోహ్తక్ నుంచి బిలాస్‌పూర్ సమీపంలోని ఘుమార్విన్ వైపు వెళ్తుండగా, ఝండూత అసెంబ్లీ నియోజకవర్గంలోని భలుఘాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
#BreakingNews | Bus buried under debris after landslide in Himachal Pradesh's Bilaspur
Several passengers are feared trapped. Rescue operation underway.#HimachalPradesh #Bilaspur #BilaspurAccident pic.twitter.com/Xm5CMSIFfy— DD News (@DDNewslive) October 7, 2025