ఖమ్మం: ఓ స్కూల్ బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం గణేష్‌పాడులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


ఆ సమయంలో స్కూల్ బస్సులో 105 మంది చిన్నారులు ఉన్నారు. అయితే కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవ్ చేసే సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించాడని విద్యార్థులు చెబుతున్నారు.




