హైదరాబాద్: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి.
ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. మధ్యాహ్న భోజనం సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు పెడతారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఆ క్లాసుల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.
పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లు.. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని రోజుల్లో పరీక్షా ఆ స్కూళ్లు కూడా యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి 12.30 గంటల వరకు పనిచేయాలి. ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (DEOs) డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు.


